BigTV English

HIT3: నానితో పాటు మరో హీరో… హిట్ 3 మల్టీ స్టారర్ అవుతుందా..?

HIT3: నానితో పాటు మరో హీరో… హిట్ 3 మల్టీ స్టారర్ అవుతుందా..?

HIT3 : తెలుగు ఇండస్ట్రీ నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా హిట్ 3. తెలుగు ఇండస్ట్రీలో క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న సరికొత్త సినిమా హిట్ 3. హిట్ సీక్వెల్ లో ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మూడో భాగం హిట్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విభిన్నమైన కథనాలతో, ఇన్వెస్టిగేషన్ టీం తో హిట్ సిరీస్ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాయి. హిట్ 3 ఫై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈరోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాజమౌళి విచ్చేశారు.విశ్వక్సేన్, అడవి శేషు, శైలేష్ కొలను,నిర్మాత ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.ఈవెంట్ లో ఫైట్ మాస్టర్ సతీష్ మాట్లాడుతూ సినిమా లో ఓ సీక్రెట్ ని రివిల్ చేశారు. అదేంటే ఇప్పుడు చూద్దాం..


మల్టీ స్టార్ గా రానుందా ..

సతీష్ గారు మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో ఆయనకీ చాలా, దెబ్బలు తగిలాయి వాటిని లెక్కచేయకుండా మొండిగా సినిమాని పూర్తి చేశారు. గట్టిగా ఉంటాయి ఫైట్లు ఈసారి ఓపెనింగ్ ఫైట్ చాలా బాగుంటుంది. దర్శకుడి ప్లానింగ్ తో ఈ సినిమా చాలా బాగా జరిగింది. సాను సార్ కి థాంక్స్ చెప్పాలి. ఆయన సపోర్ట్ నాకు చాలా ఉంది అని, ఈ సినిమాలో హీరోయిన్ తో ఓ ఫైట్ ఉంది అది చాలా బాగా వచ్చింది అని, సతీష్ అనగానే వెంటనే యాంకర్ గా ఉన్న సుమ దగ్గరికి వచ్చి మీరు స్టోరీ రివిల్ చేస్తున్నారా ఏంటి, ఇంకా ఏమైనా చెప్పాలా అని అనగానే ఇంకొక విషయం ఉంది శేషు సార్ మనం అని సతీష్ ఆపేస్తారు. వెంటనే అక్కడున్న వారికందరికీ అర్థం అయిపోతుంది అడవి శేషు కూడా ఒక సీన్లో ఈ సినిమాలో కనిపిస్తున్నారా అన్నది తెలిసింది. లేదంటే సినిమాలో కొంత టైం వరకు కనిపిస్తారా ఇది మల్టీ స్టార్ సినిమానా లేదా నాని మాత్రమే హీరోనా అనె ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయి మరి దీనికి సమాధానం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.


హిట్ ఫ్రాంచెస్ ఫ్యాన్..

ఈ ఈవెంట్ కోర్టు సినిమా డైరెక్ట్ చేసిన రామ్ జగదీష్ గారు మాట్లాడుతూ.. కోర్టు సినిమా సక్సెస్ చేసినందుకు ముందు మీకు థాంక్స్, ఈ స్టేజి మీద నించొని మాట్లాడేంత అర్హత నాకు రాలేదు. హిట్ ఫ్రాంచెస్ ఫ్యాన్ గా మాట్లాడుకుందాం.. హిట్ మొదటి భాగం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అంచనాలు బాగా ఉన్నాయి. నాని గారి గురించి నేనేం చెప్పలేను ఆయన సూపర్ అంతే, సైలేషు గారు సినిమా చాల బాగా వచ్చింది సినిమాను మనం మే 1 న చూద్దాం అని అయన అన్నారు. ఇందులో నాని అర్జున్ సర్కార్ పాత్రలో విజృంభన చేయడానికి రెడీ అయిపోయారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సినిమా ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

 

Sobhita : సమంత కుక్కతో శోభిత.. అది నీ రేంజ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×