BigTV English

Vastu Tips For Tulsi: తులసి చెట్టుకు ఈ దారం కడితే.. లక్ష్మీ దేవి అనుగ్రహం, డబ్బుకు ఏ లోటూ ఉండదు

Vastu Tips For Tulsi: తులసి చెట్టుకు ఈ దారం కడితే.. లక్ష్మీ దేవి అనుగ్రహం, డబ్బుకు ఏ లోటూ ఉండదు

Vastu Tips For Tulsi: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచడం ద్వారా సానుకూల శక్తి ప్రసారం అవుతుంది. తులసి మొక్కకు వాస్తు శాస్త్రంలో మాత్రమే కాకుండా జ్యోతిష్యశాస్త్రంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది శాంతిని , శ్రేయస్సును తెస్తుంది. అందుకే దీనిని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. కానీ.. కొన్నిసార్లు ఇంట్లో సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తులసి మొక్క ఎండిపోవడం ప్రారంభమవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇది ప్రతికూల శక్తి ప్రభావం వల్ల జరుగుతుంది.


వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావం పెరిగినప్పుడు.. తులసి మొక్క పెరుగుదల కూడా ప్రభావితమవుతుంది. దీనిని పరిష్కరించడానికి.. తులసి కాండానికి ఎర్రటి దారం కట్టండి. ఈ దారం ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా మొక్క చుట్టూ సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. తులసి మొక్కను మళ్ళీ పచ్చగా , ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తులసికి ఎర్రటి దారం కట్టడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు , శాంతి పెరుగుతాయి. ఇదిలా ఉంటే కానీ తులసి చెట్టుకు ఎర్రటి దారం కట్టడానికి ఒక పద్ధతి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి మొక్కకు ఎర్రటి దారం ఎలా కట్టాలి ?


తులసి మొక్కకు ఎర్రటి దారం కట్టడం ద్వారా.. లక్ష్మీ దేవి ప్రసన్నురాలవుతుంది. అంతే కాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఇంట్లో సంపద , శ్రేయస్సు పెరుగుతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతిరోజూ తులసికి నీరు అర్పించడం ద్వారా విష్ణువు , లక్ష్మీ దేవి నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి.

వాస్తు శాస్త్రంలో కూడా.. తులసి మొక్క సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది. ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండే ఈ పవిత్ర దారాన్ని దాని చుట్టూ కట్టినప్పుడు మొక్క ఎండిపోకుండా కాపాడటమే కాకుండా చుట్టుపక్కల శక్తిని సానుకూలంగా మారుస్తుంది. తద్వారా ఇంట్లోకి సంపదను తెస్తుంది.

దారం కట్టే విధానం:
మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకుంటే.. శుక్రవారం తులసి మొక్కకు ఎర్రటి దారం కట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు ఉదయం తలంటు స్నానం చేయండి. తరువాత ఒక ప్లేట్ లో దీపం, ఒక కుండలో నీరు, గంగాజలం, బియ్యం, స్వీట్లు, ఎర్రటి దారం తీసుకోండి. తర్వాత తులసి మొక్కను గంగా జలం సమర్పించండి. తరువాత తులసి మొక్క ముందు బియ్యంతో స్వస్తిక తయారు చేసి, దానిపై అక్షతలు , పసుపు , కుంకుమ, సమర్పించండి. ఇప్పుడు దీపం వెలిగించి, తులసి కాండం, కుండ చుట్టూ ఎర్రటి దారాన్ని చుట్టండి.ఈ దారం చాలా గట్టిగా లేదా చాలా వదులుగా ఉండకూడదని గుర్తుంచుకోండి.

Also Read: ఉదయం నిద్ర లేవగానే చూడకూడనివి ఇవే !

ఈ విషయాలను కూడా గుర్తుంచుకోండి:

తులసి చెట్టుకు ఎర్రటి దారం కట్టేటప్పుడు మొత్తం విధానాన్ని అనుసరించడం చాలా ముఖ్యం.
ఈ సమయంలో.. ఎటువంటి ప్రతికూల ఆలోచనలు మనస్సులోకి రాకూడదు.
తులసి మొక్కకు ఎరుపు రంగు దారాన్ని మాత్రమే కట్టండి.
తులసిని ముట్టుకునే ముందు, గంగా నీటితో స్నానం చేయండి.
చివర దీపం వెలిగించడం కూడా తప్పనిసరి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×