AP ICET Results: ఏసీ ఐసెట్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకు ఇది బిగ్ అలర్ట్. ఏపీ ఐసెట్ ఫలితాలను అధికారుల విడుదల చేశారు. కాసేపటి క్రితమే ఏయూ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్ ఎగ్జామ్ రాసినవారిలో మొత్తం 95.86 శాతం మంది అభ్యర్థులు అర్హత పొందారు.
Also Read: IHMCL Recruitment: ఈ ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ భయ్యా.. ఈ అర్హత ఉన్నవాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు..
ఐసెట్ పరీక్ష మొత్తం 34,131మంది విద్యార్థులు రాశారు. ఇందులో 32,719మంది క్వాలిఫై అయ్యారని.. అధికారులు తెలిపారు ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేషన్ అభినందనలు తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో 94 పరీక్ష కేంద్రాల్లో మే 7న ఐసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఐసెట్‌లో క్వాలిఫై అయిన 32,719 మంది అభ్యర్థుల్లో.. 15,176మంది అబ్యాయిలు, 17,543మంది అమ్మాయిలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
టాప్-10 ర్యాంకర్లు వీళ్లే..
మనోజ్ మేకా (విశాఖ) అత్యధిక మార్కులతో ఒకటో ర్యాంకు సాధించగా.. ఆ తర్వాత ర్యాంకుల్లో ద్వారకచర్ల సందీప్ రెడ్డి (వైఎస్సార్ కడప), ఎస్. కృష్ణసాయి (ఎన్టీఆర్ జిల్లా), వల్లూరి సాయిరాం సాత్విక్ (హైదరాబాద్), రేవూరి మాధుర్య (గుంటూరు), షేక్ బషీరున్నీషా (అనకాపల్లి), వి. అజయ్ కుమార్ (తిరుపతి), భీశెట్టి హరి వెంకట ప్రసాద్ (తూర్పుగోదావరి), ఎస్. గణేశ్ రెడ్డి (వైజాగ్), మహేంద్ర సాయి చామా (తిరుపతి) టాప్ టెన్ ర్యాంకులు సాధించారు.