BigTV English

Surya Grahan 2024: వీరిపై సూర్యగ్రహణ ప్రభావం.. జాగ్రత్త పడకపోతే ఇబ్బందులే !

Surya Grahan 2024: వీరిపై సూర్యగ్రహణ ప్రభావం.. జాగ్రత్త పడకపోతే ఇబ్బందులే !

Surya Grahan 2024: ఈ ఏడాదిలో సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడనుంది. అక్టోబర్ 2వ తేదీ రాత్రి 9:13 గంటలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 3:17 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం యొక్క మొత్తం సమయం 6 గంటల 4 నిమిషాలు ఉంటుంది. సూర్యగ్రహణాన్ని అర్జెంటీనా, ఆర్కిటిక్, పెరూ, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం ,ఫిజీ వంటి దేశాల వారు మాత్రమే చూడవచ్చు. గ్రహణం భారతదేశంలో కనిపించదు. కానీ ఇది అన్ని రాశుల వారిపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.


మిధున రాశి:
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం మిథున రాశి వారికి కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది. మిథున రాశి వారి జీవితంలో కొన్ని పెద్ద సంఘటనలు జరగే అవకాశం ఉంది. కాబట్టి, మిథున రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. సూర్య గ్రహణం రోజు నుంచి మీరు చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు తీపుకోవడం అవసరం. తొందరపడి ఏ నిర్ణయాలను కూడా తీసుకోవద్దు.

కర్కాటక రాశి:
ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం కర్కాటక రాశి వారికి అనేక ఇబ్బందులను సృష్టిస్తుంది. ప్రేమ జీవితంలో, వృత్తిలో సమస్యలు ఏర్పడతాయి. ఏ పని అయినా జాగ్రత్తగా చేయండి. అప్పుడే వీటన్నింటి నుంచి తప్పించుకోగలుగుతారు. రోడ్డు ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రహణం సమయంలో మీ ప్రియమైనవారి ఆరోగ్యంలో మార్పులను వస్తాయి. సహనం పాటించండి. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించండి.


వృశ్చిక రాశి:
2024 సంవత్సరపు చివరి సూర్యగ్రహణం వృశ్చిక రాశి వారికి అశుభం కలిగిస్తుంది. మీరు పూర్తి చేయాలనుకున్న పని కష్టపడి చేసిన తర్వాత కూడా విఫలం అవుతుంది. వ్యాపారులు, ఉద్యోగస్తులు జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు పెరుగుతాయి.

Also Read: ప్రతి రోజు ఉదయం ఇలా చేస్తే.. మీ ఇంట్లో డబ్బుకు లోటుండదు

మీన రాశి:
2024 సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం మీన రాశి వారికి ప్రమాదకరం. కెరీర్‌లో అనేక రకాల సమస్యలు ఈ సమయంలో తలెత్తుతాయి. ప్రేమ జీవితం కూడా బిజీగా మారుతుంది. ఆకస్మిక ధన నష్టం కలుగుతుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. ఎక్కడైనా సరే డబ్బును తెలివిగా ఖర్చు చేయండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున డబ్బు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

గ్రహణం యొక్క ప్రభావాలను నివారించడానికి మార్గాలు..
సూర్యగ్రహణం యొక్క అశుభ ప్రభావాలను తగ్గించడానికి, మీరు గ్రహణం సమయంలో సూర్య భగవానుడి మంత్రాలను జపించాలి. గ్రహణం ముగిసిన తర్వాత, శనగలు, బెల్లం, గోధుమలు, పప్పులను దానం చేయండి. ఈ పరిహారాలు చేయడం ద్వారా గ్రహణం యొక్క అననుకూల ప్రభావాలను నివారించవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేస్తే.. అష్టకష్టాలు తొలగిపోతాయ్

Dhantrayodashi 2025: ధన త్రయోదశి రోజు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే.. సంపద వర్షం

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. డబ్బే డబ్బు !

Atla Taddi 2025: ఆడపడుచుల పండుగ అట్లతద్ది.. రాకుమారి కథ తెలుసా?

Vastu Tips: ఇంట్లో డబ్బు, బంగారం ఈ దిశలో ఉంచితే.. సంపద రెట్టింపు !

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Big Stories

×