Gajakesari yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు దాదాపు ప్రతి రెండున్నర రోజులకు తన రాశిని మారుస్తుంటాడు. శని , బృహస్పతి వంటి గ్రహాలు ఒకటి నుండి రెండున్నర సంవత్సరాల తర్వాత ఒక రాశి నుండి మరొక రాశికి మారుతాయి. గ్రహాల రాశిచక్రంలో మార్పులు ఖచ్చితంగా ప్రతి రాశికి చెందిన వ్యక్తుల జీవితాలను ఏదో ఒక విధంగా ప్రభావితం చేస్తాయి. చాలా సార్లు, ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు, అనేక రకాల యోగాలు ఏర్పడతాయి. దేవగురువు బృహస్పతి ప్రస్తుతం శుక్రుని రాశి అయిన వృషభరాశిలో సంచరిస్తున్నాడు. కొన్ని రోజుల తరువాత, చంద్రుడు, బృహస్పతి కలయిక జరగనుంది. ఇది గజకేసరి అనే శక్తివంతమైన రాజయోగాన్ని సృష్టిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగం చాలా పవిత్రమైనదిగా చెబుతారు. కొన్ని రాశుల వారికి గజకేసరి రాజయోగం ఏర్పడటం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. డిసెంబర్ 13న, దేవగురు బృహస్పతి ఇప్పటికే ఉన్న వృషభరాశిలో చంద్రుడు సంచరిస్తాడు. అటువంటి పరిస్థితిలో చంద్రుడు, గురుగ్రహ కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. బృహస్పతి , చంద్రుని కలయికతో ఏర్పడిన గజకేసరి యోగం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
డిసెంబర్ 13, 2024 న, మీ లగ్న గృహంలో చంద్ర-గురు సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మొదటి ఇంట్లో గజకేసరి యోగం ఏర్పడుతుంది. లగ్న యోగంలో గజకేసరి యోగం ఏర్పడటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం, గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ఆఫీసుల్లో కొత్త విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు , ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. అంతే కాకుండా మీరు శుభ వార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఉన్నతాధికారుల నుంచి మీరు మీ పని విషయంలో ప్రశంసలు అందుకుంటారు. పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. విద్యార్థుకు ఇది చాలా మంచి సమయం. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అంతే కాకుండా మీ కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా గడుపుతారు.
కన్య రాశి :
కన్య రాశి వారికి, బృహస్పతి , చంద్రుల కలయిక మీకు శుభప్రదంగా ఉంటుంది. పనిలో విజయం ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాల పరంగా బాగుంటుంది. కార్యాలయంలో మీకు కొంత బాధ్యతను అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబంలోని ప్రతి సభ్యుని నుండి మద్దతు ఉంటుంది. గౌరవం, కీర్తి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి.అంతే కాకుండా విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ఉద్యోగులు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: పగడం ఎవరు ధరించాలి ? దీని వల్ల కలిగే లాభాలు ఏమిటి ?
వృశ్చిక రాశి:
డిసెంబర్ 13వ తేదీన జాతకంలో సప్తమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఫలితంగా మీరు మీ వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. జీవితంలోని ప్రతి రంగంలో మంచి విజయాన్ని పొందుతారు. ఆర్థిక లాభాలకు అవకాశాలు పెరుగుతాయి. కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆకస్మిక లాభాలకు అవకాశాలు పెరుగుతాయి. కుటుంబ విషయాల్లో మంచి నిర్ణయాలను తీసుకుంటారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను అందిస్తాయి.