BigTV English

AP Schemes: ఏపీలో మహిళలకు పండగే.. కొత్త ఏడాదిలో ఆ రెండు స్కీమ్స్.. మీరు సిద్దమేనా!

AP Schemes: ఏపీలో మహిళలకు పండగే.. కొత్త ఏడాదిలో ఆ రెండు స్కీమ్స్.. మీరు సిద్దమేనా!

AP Schemes: కొత్త ఏడాది వస్తోంది. వరుస పథకాలు తెస్తోంది. ఇదే పాట పాడుతున్నారు ఏపీ మహిళా లోకం. అంతేకాదు ప్రభుత్వం కూడా ఆ మేరకు ముందడుగు వేస్తోంది. ఇప్పటికే 6 నెలల పాలన పూర్తి చేసుకున్న ఏపీ ప్రభుత్వం, మహిళా లోకానికి వరాలు కురిపించేందుకు సిద్దమైంది. ఇంతకు ఆ వరాలు ఏమిటో తెలుసుకుందాం.


ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. అయితే వరదలు పోటెత్తడంతో కొంత వరదసాయం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని ప్రారంభించగా, ప్రతి రైతుకు ఏటా రూ. 20 వేల సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్దం కానుంది.

అయితే ఫ్రీ బస్సు అమలు, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 పథకాలు అమలుపై ప్రభుత్వం నుండి ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో, కొంత ప్రజల్లో ఈ పథకాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వైసీపీ సైతం ఈ పథకాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు విమర్శలు చేస్తోంది.


కాగా నిరుద్యోగులకు డీఎస్సీ నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో సిలబస్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా అధ్వాన్నంగా ఉన్న రహదారుల అభివృద్దిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహిళల ఫ్రీ బస్సు స్కీమ్ పై ప్రభుత్వం తర్జనభర్జనలు చేసి, సంబంధిత అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించింది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వరదలు రాగా, కొంత ఈ పథకాలకు అడ్డు పడిందని చెప్పవచ్చు. అందుకే కాబోలు కొత్త ఏడాదిలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పనుందట.

Also Read: Tirumala New Rules: తిరుమలలో మరో కొత్త రూల్.. భక్తులు తెలుసుకోవాల్సిందే!

ఫ్రీ బస్సు పథకంతో పాటు, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 అందించేందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణ సిద్దం చేసినట్లు సమాచారం. అయితే ఈ పథకాలకు అర్హతలకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చిన వెంటనే కొత్త సంవత్సరం మహిళలకు కానుకగా ప్రకటించే అవకాశం ఉంది. దీన్ని బట్టి కొత్త ఏడాది మహిళలకు వరాలు కురిపిస్తుందని చెప్పవచ్చు. మరి లబ్ది పొందేందుకు మీరు సిద్దంగా ఉండండి సుమా.. ఏ క్షణంలోనైనా ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చే వీలుంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×