Ap police case file on ysrcp members at B.Kotthakota: ఏపీలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎన్నికల వేళ హింసాత్మక సంఘటనలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా జరుగుతుంటాయి. కొన్ని ప్రాంతాలలో ఏకంగా బ్యాలెట్ బాక్సులను కూడా ఎత్తుకెళడానికి వెనకాడరు. ఒక పక్క పోలీసు కేసులు నమోదవుతున్నా..హింసా ప్రవృత్తి తో చెలరేగిపోతున్నారు. దేశమంతటా గణేశుడి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పదిరోజులు అవ్వకుండానే కొన్ని ప్రాంతాలలో నిమజ్జనం కార్యక్రమాలు జరుపుతున్నారు. హైదరాబాద్ లో అధికారికంగా 17న గణేషుడి నిమజ్జనాలు జరుపుకోవాలని ఆదేశాలు రావడంతో అందుకు తగినట్లుగా ట్యాంకు బండ్ పరిసరాలలో ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏపీలోనూ వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఊపందుకుంది. అయితే ఓ ప్రాంతంలో భక్తులు వినాయక విగ్రహం ఊరేగింపులో దేవుడి పాటలు మర్చిపోయారు.
నాయకుడు-వినాయకుడు
తమ అభిమాన నాయకుడినే వినాయకుడిగా అనుకున్నారో ఏమో ఓ పక్క వినాయకుడి విగ్రహం ఊరేగింపు జరుపుతూ అందులో భాగంగా జగనన్న పాటలు పెట్టారు. రావాలి జగన్ కావాలి జగన్ అంటూ పాపులర్ పాటలను డీజే రూపంలో మోత మోగించారు. అంతేకాదు కాసేపట్లో వినాయక నిమజ్జనం కార్యక్రమం కాస్తా ఎన్నికల ర్యాలీ రథంగా మారిపోయింది. వైఎస్ఆర్ సీపీ జెండాలను ఎగురవేస్తూ బాణాసంచా ఎగురవేస్తూ జగనన్న పాటలకు డ్యాన్సులు చేస్తూ ముందుకు సాగారు. అన్నమయ్య జిల్లా బి.కొత్త కోట లో జరిగిన ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కొందరు తెలుగుదేశం నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి ఉత్సవ కమిటీ సభ్యులతో ముందుగా సామరస్య పూర్వకంగా చర్చించారు. దేవుడి ఊరేగింపు చేస్తూ మధ్యలో రాజకీయ పార్టీల ప్రస్తావన ఎందుకు అని అడిగారు. అయితే ఉత్సవ కమిటీ సభ్యులపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. అసలు మండపానికి అనుమతి అయినా తీసుకున్నారా లేదా అని ఆరా తీస్తున్నారు.
Also Read: ఆర్జీవీ ‘శారీ’ టీజర్.. పేరుకే చీర, అందాలు ఆరబోతే ఎక్కువ.. మరో అడల్ట్ మూవీ అవుతుందా?
మండపాలలో అశ్లీల పాటలు
వినాయక మండపాలలో అశ్లీల పాటలపై పలు హిందూ సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. చక్కగా దేవుడి పాటలు వినిపించకుండా ఇలాంటి అసభ్య పాటలను ఎందుకు పెడుతున్నారంటూ హిందూ సంఘాలు ఆరోపిస్తున్న వేళ ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకుల పాటలు జనాన్ని ఇరిటేట్ చేస్తున్నాయి.