Mercury Transit 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, బుధుడు తెలివితేటలు, సంపదను ప్రసాదించే గ్రహంగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి జాతకంలో బుధ గ్రహం బలంగా ఉన్నప్పుడు, వ్యక్తి తెలివైనవాడు అవుతాడు. దృక్ పంచాంగ్ ప్రకారం, గ్రహాల రాకుమారుడు బుధుడు మరి కొన్ని రోజుల్లో తన రాశిని మార్చబోతున్నాడు. అంటే సెప్టెంబర్ 21న బుధుడు ఉత్తర ఫాల్గుణ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు రాశి మార్పు కొన్ని రాశులపై ప్రభావం చూపుతుంది.
బుధుడు తన రాశిని మార్చినప్పుడు, ఇది కొన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. బుధుడి సంచారము వల్ల కొన్ని రాశుల వారికి చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది. అలాగే ఏ పనైనా తెలివిగా చేస్తారు. మరి ఏ రాశుల వారిపై బుధుడు సానుకూల ప్రభావం చూపబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
మిధున రాశి:
ఉత్తర ఫాల్గుణ నక్షత్రంలో బుధుడి సంచారము మిధున రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బుధుడిని మిధున రాశికి అధిపతిగా చెబుతారు. బుధుడి సంచారం మిథున రాశి వారికి అపారమైన ప్రయోజనాలను అందించబోతున్నాడు. కెరీర్ రంగంలో అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న వారి కల త్వరలో నెరవేరుతుంది. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. మత పరమైన కార్యక్రమాల్లో మీరు పాల్లొనేందుకు అవకాశాలు ఉన్నాయి.
తులా రాశి:
ఈ రాశి వారికి మెర్క్యురీ సంచారం అనుకూలంగా ఉంటుంది. మానసిక సమస్యలతో బాధపడేవారు సెప్టెంబర్ 21 తర్వాత ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో మీరు ఏ పనైనా తెలివిగా చేయగలుగుతారు. మీ మనసు ఆనందంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ధనలాభం పొందుతారు. ఇదే సమయంలో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడే వారికి అకస్మాత్తుగా డబ్బు వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది.
మకర రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడి రాశి మార్పు మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మెర్క్యురీ గ్రహం తెలివితేటలకు, మనస్సుకు బాధ్యత వహించే గ్రహంగా పరిగణించబడుతుంది. కాబట్టి సెప్టెంబర్ 21 తర్వాత విద్యార్థులు శుభవార్తలు వింటారు. బుధుని అనుగ్రహంతో అన్నిపనుల్లో మీరు విజయం పొందుతారు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. అంతే కాకుండా వివాహం చేసుకున్న వ్యక్తులు వారి జీవితంలో సంతోషంగా ఉంటారు.
Also Read: శుక్రుని వల్ల ఈ 3 రాశులకు బంపర్ ఆఫర్ దక్కబోతుంది..
కర్కాటక రాశి:
వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్కాటక రాశి వారికి బుధుడి రాశి మార్పు ఒక వరం. బుధుడి రాశి మార్పు సమయంలో, కర్కాటక రాశి వ్యక్తుల వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధి ఉంటుంది. అలాగే జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది. వివాహమైన వారు తమ ఇళ్లలో త్వరలో శుభవార్త వింటారు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ తీరుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆఫీసుల్లో మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)