EPAPER

Engagement Ring : తాంబూలాల సమయంలో ఒకరి వేలికి మరొకరు ఉంగరం తొడిగేందుకు?

Engagement Ring : తాంబూలాల సమయంలో ఒకరి వేలికి మరొకరు ఉంగరం తొడిగేందుకు?

Engagement Ring : వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో పెళ్ళి ఖాయపరచుకోవడాన్ని నిశ్చితార్థం అంటారు.. వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు. వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం.


ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ లో పెళ్లి కూతురూ, పెళ్లి కొడుకూ ఒకరికొకకరు ఉంగరాలు పెట్టుకోవడం జరుగుతుంది. కాబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు జీవితకాలం తాము గుర్తుంచుకునే మధుర క్షణాలు అవి. ఈ కార్యక్రమంలో ఉంగరాన్ని వేలికి తొడగటంలో ఒక అర్థం ఉంది . ఉంగరం వేలికి నరానికి , హృదయానికి అవినాభావ సంబంధం ఉంది. నా మనసనే నా ఈ ఉంగరాన్ని నీ వేలికి తొడుగుతున్నాను. ఉంగరం వేలికి పెట్టిన రింగు ద్వారా నీ హృదయాన్ని అంటిపెట్టుకుని ఉంటానని చెప్పడమే ఈ రింగు వెనుక అర్థం.

అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది.


నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టుగానే భావిస్తారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ వేడుకను పెళ్లికంటే ఘనంగా, ఆడంబరంగా జరుపుకుంటున్నారు. సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తల్లితండ్రుల మధ్యన ఇచ్చి,పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా ఉంటాయి.

Tags

Related News

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Horoscope 19 September 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనలాభం!

Budh Gochar 2024: కన్య రాశిలో బుధుడి సంచారం.. వీరికి అన్నీ శుభవార్తలే

19 September 2024 Rashifal: రేపు ధనుస్సుతో సహా 5 రాశుల వారికి సంపద పెరగబోతుంది

Big Stories

×