E-Paper
Advertisement

Mysterious Wells: రామేశ్వరం వెళ్తున్నారా..? అయితే ఖచ్చితంగా ఈ మిస్టరీ బావుల గురించి  తెలుసుకోవాల్సిందే

Mysterious Wells: రామేశ్వరం వెళ్తున్నారా..? అయితే ఖచ్చితంగా ఈ మిస్టరీ బావుల గురించి  తెలుసుకోవాల్సిందే

Mysterious Wells: రామేశ్వరం వెళ్తున్నారా..? అయితే అక్కడి మిస్టరీ బావులు గురించి తెలుసా..? మీకు ఆ బావుల నీళ్లతో స్నానం చేస్తే వచ్చే లాబాలు గురించి తెలుసా..? మీకు ఇంతకీ అక్కడ ఎన్ని బావులున్నాయి.. ఏ బావిలో స్నానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో లాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

మన దేశంలో మిస్టరీ ఆలయాలకు కొదువ లేదు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ దాకా లక్షల సంఖ్యలో ఆలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. ఒక్కో ఆలయానికి ఒక్కో మిస్టరీ ఉంటుంది. అయితే తమిళనాడులోని రామేశ్వరంలోనూ ఆసక్తికరమైన 22 మిస్టరీ బావులున్నాయి. ఆ 22 బావుల గురించి చాలా కొద్ది మందికే తెలుసు.. అది కొద్దిగా మాత్రమే తెలుసు.. కానీ అయితే ఆ బావులలో స్నానం చేస్తే కలిగే లాభాల గురించి చాలా మందికి తెలియదు. అందుకే ఆ బావుల్లో స్నానం చేస్తే కలిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహాలక్ష్మీ తీర్థం: ఈ తీర్థంలో ఉన్న నీటితో ఆలయానికి వెళ్లిన భక్తులు స్నానం చేస్తే వారికి ధన సంపాదన పెరుగుతుందట. మనసు శుద్ది అవుతుందట, అలాగే దారిద్యం తొలగిపోతుందట.

సావిత్రి తీర్థం: ఈ బావి నీటితో స్నానం చేస్తే.. వాక్పటిమ, మానసిక శక్తి, ప్రవచనం, గానం, అధ్యయనంలో పురోగతి లాంటి లాభాలు కలుగుతాయట.

గాయత్రీ తీర్థం: ఈ తీర్థం నీటితో స్నానం చేస్తే..  అప్పటి వరకు చేసిన పాపాలన్నీ నశించిపోతాయట. జపసిద్ధి, మానసిక ప్రశాంతత కలుగుతాయట.

సరస్వతీ తీర్థం: ఈ బావి నీటితో స్నానం చేస్తే.. విద్య, కళలలో అభివృద్ధి కలుగుతుందట. మాట, జ్ఞానం పవిత్రమవుతుందట.

సేతు మాధవ తీర్థం: ఈ తీర్థం రామసేతు వైభవానికి సూచకగా చెప్తారట.  ఈ తీర్థంలో స్నానం చేస్తే.. కుటుంబ సమైక్యత, శుభకార్య సిద్ది లభిస్తాయట.

గంధమాధన తీర్థం: ఈ తీర్థం నీటితో స్నానం చేస్తే.. దేహ పవిత్రంగా మారిపోతుందట.  శరీర సంబంధిత వ్యాదులు తగ్గిపోతాయట. అలాగే మనసుకు శాంతి లభిస్తుందట.

గవాక్ష తీర్థం: ఈ బావి నీటితో స్నానం చేస్తే ఆ ముక్కటి దర్శనం భాగ్యం సులభంగా అవుతుందట. అలాగే గ్రహదోషాలు నివారించబడతాయట.

నల తీర్థం: ఈ బావి నీటితో స్నానం చేస్తే.. నల మహర్షి కృప లభిస్తుందట. అలాగే పెళ్లి కానీ వాళ్లు పెళ్లిళ్లు అవుతాయట. కుటుంబంలోనూ ఐక్యత కలుగుతుందట.

నీల తీర్థం: ఈ తీర్థం నీటితో స్నానం చేస్తే.. ధైర్యం, శౌర్యం పెరుగుతాయట

శంఖ తీర్థం: ఈ బావి నీటిలో స్నానం చేస్తే.. విష్ణు ప్రసాదం లభిస్తుందట. అలాగే సంపూర్ణ శాంతి, భయ నివారణ లభిస్తాయట.

చక్ర తీర్థం: ఈ తీర్థం నీటిలో స్నానం చేస్తే.. సుదర్శన చక్ర శక్తి లభిస్తుందట. అలాగే పాప నాశనం, కష్ట నివారణ కలుగుతాయట.

బ్రహ్మ హతీ విమోచన తీర్థం: ఈ బావి నీటిలో స్నానం చేస్తే.. బ్రహ్మ హత్యా దోషం కూడా భస్మం అవుతుందట. కొత్త ప్రారంభాలు విజయవంతం అవుతాయట.

శివ తీర్థం: ఈ తీర్థం నీటితో స్నానం చేస్తే.. రోగాలు తగ్గిపోతాయట. అపశకునాలు తొలగిపోతాయట. అలాగే పరమశివుడి అనుగ్రహం లభిస్తుందట.

సూర్య తీర్థం: ఈ బావిలో స్నానం చేస్తే.. ఎంతో పుణ్య ఫలం లభిస్తుందట. అలాగే ఆరోగ్యం, శరీర కాంతి పెరుగుతాయట.

చంద్ర తీర్థం: ఈ బావి నీటిలో స్నానం చేస్తే.. మానసిక శాంతి లభిస్తుందట.. మనసు నిలకడ లేకపోవడం.. కోపం ఎక్కువగా వస్తుండటం లాంటివి నివారణ అవుతాయట.

గంగా తీర్థం: ఈ తీర్థ జలంతో స్నానం చేస్తే.. అఖండ పాప పరిహారం జరుగుతుందట. అలాగే జీవితంలో శుభ ప్రదమైన పనులు చేస్తారట.

యమునా తీర్థం: ఈ బావి నీటిలో స్నానం చేస్తే.. మీకున్న దరిద్రాలన్నీ పోతాయట. అలాగే శాంతి చేకూరుతుందట.

గోదావరి తీర్థం: ఈ తీర్థం నీటితో స్నానం చేస్తే.. మీ శక్తి రెట్టింపు అవుతుందట.. అలాగే మీకు దీర్ఘాయుష్షు పెరుగుతుందట.

సరస్వతీ తీర్థం: ఈ తీర్థ జలంతో స్నానం ఆచరిస్తే.. సంస్కార శుద్ధి జరుగుతుందట..

నర్మదా తీర్థం: ఈ బావి జలంతో స్నానం చేస్తే.. మీకున్న శక్తి డబులు అవుతుందట. అలాగే అప్పుల బాధలు తొలగిపోతాయట.

సింధు తీర్థం: ఈ తీర్థంలో స్నానం  చేస్తే.. మీరు తలపెట్టే పనిలో ఎదురయ్యే విఘ్నాలు తొలగిపోతాయట.

కోటి తీర్థం: ఈ తీర్థంలో స్నానం చేస్తే త్రిభువన శక్తి వస్తుందట. అలాగే అన్ని బావుల్లో స్నానం చేసిన పుణ్యఫలం కూడా ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల వస్తుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమలలొ మరో మూడు రోజులు అన్ని దర్శనాలు రద్దు – అది కూడా ఈ నెలలోనే – ఎందుకో తెలుసా..?

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×