Remedies: పని మీద బయటకు వెళ్తున్నారా..? చేస్తున్న పనిలో అవాంతరాలు ఎదురవుతున్నాయా..? ఎంత కష్టపడినా విజయం ఎండమావే అవుతుందా..? అయితే తంత్రశాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు పాటిస్తే విజయం మీ వెనకే పరుగెడుతుందట. ఆ రెమిడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిత్య జీవితంలో ఎన్నో పనుల నిమిత్తం బయటకు వెళ్తుంటారు. అయితే చాలా మందికి తాము వెళ్లిన పనుల్లో జాప్యం జరగడమో లేక పనులే వాయిదా పడటం జరగుతుంది. ఇంకొన్ని సార్లు మొత్తానికే పనుల్లో సక్సెస్ ఉండక టెన్షన్ పడుతుంటారు. అయితే పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్న వారి కోసమే భారతీయ తంత్రశాస్త్రం చాలా సింపుల్ రెమెడీస్ చెప్పిందని తంత్ర శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఈ పరిహారాలు పాటించడం వల్ల మీ పనుల్లో విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని నమ్మకం. అయితే ఏ రోజు ఏ పరిహారం పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సోమవారం: సోమవారం ఎవరైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే.. పరిహార శాస్త్రం ప్రకారం ఇంట్లోని అద్దంలో మీ ముఖాన్ని చూసుకుని బయలుదేరాలట. ఇక అంటే మీరు వెళ్లిన పని విజయవంతంగా పూర్తి అవుతుందట.
మంగళవారం: మంగళకరమైన వారమే మంగళవారం అంటారు. ఆంజనేయస్వామిక ఇష్టమైన వారం. అమ్మవారికి కూడా ఇష్టమైన వారం మంగళవారం అటువంటి మంగళవారం నాడు ఏదైన పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుని బయలుదేరాలట. ఇక అంతే మీరు వెళ్లిన పని సక్సెస్ అవుతుందని పరిహార శాస్త్ర నిపుణులు చెప్తున్నారు.
బుధవారం: ఈరోజు వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం ఏదైనా పనులు ప్రారంభించినా.. నూతన భవనాలు ప్రారంభించినా వ్యాపారాలు మొదలు పెట్టినా ఎలాంటి విఘ్నాలు జరగకుండా ముందుకు సాగుతాయని నమ్మకం అలాంటి బుధవారం రోజు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కొన్ని ధనియాలు తీసుకుని నోట్లో వేసుకుని నములుకుంటూ వెళ్లాలట. అప్పుడే మీరు వెళ్లిన పనిలో విజయం మిమ్మల్ని వరిస్తుందట.
గురువారం: గురు గ్రహానికి సంబంధించిన రోజే గురువారం. గురు అనుగ్రహం ఉంటే జీవితంలో డబ్బుకు పేరుకు హోదాకు కొదవ ఉండదని నమ్ముతారు. ఏ వ్యక్తికైనా పెళ్లి కావాలన్నా.. ఇల్లు కట్టుకోవాలన్నా ముందు గురుబలం ఉందా లేదా అనేదే చూస్తారు జ్యోతిష్యులు. అలాంటి గురువారం రోజు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు జీలకర్ర నములుతూ వెళ్లాలని తంత్రశాస్త్రం చెప్తుందట.
శుక్రవారం: లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం. ఎవరి జీవితంలోనైనా డబ్బుకు కొదవ లేకుండా ఉండాలంటే లక్ష్మీ కటాక్షం ఉంటాలంటారు. లక్ష్మీ దేవి ఆశీస్సులు ఉంటే జీవితం తాపీగా సాగుతుందని నమ్ముతారు. అలాంటి లక్ష్మీ వారమైన శుక్రవారం రోజు ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వస్తే ఆ పనిలో విజయం తప్పకుండా మిమ్మల్ని వరించాలంటే పెరుగులో పంచదార కలుపుకుని తాగి వెళ్లాలట. అప్పుడే మీకు అనుకూలమైన ఫలితం వస్తుందట.
శనివారం: కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పుట్టిన రోజు ఆయనకు ఇష్టమైన రోజు శనివారం. అలాగే మనిషిలోని కల్మషాన్ని కడిగిపారేసే శనీర్వరుణికి ఇష్టమైన రోజు కూడా శనివారమే.. అలాంటి శనివారం నాడు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకుని నములుకుంటూ వెళ్లాలట. దీంతో మీరు వెళ్లిన పనిలో విజయం మిమ్మల్నే వరిస్తుందట.
ఆదివారం: సూర్య భగవానుడికి ఇష్టమైన రోజే ఆదివారం. దీనినే భానువారం అంటారు. ఆదివారం ఏదైనా పని మీద బయటకు వెళ్లితే తమలపాకును తిని వెళ్లాలట. అప్పుడే మీకు పనిలో ఉన్న విఘ్నాలు దూరమవుతాయని పరిహార శాస్త్రంలో ఉందంటున్నారు పండితులు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: దేవుని పూజకు పనికిరాని పువ్వులేవో తెలుసా..? అవి వాడితే పుణ్యం కన్నా పాపం చుట్టుకుంటుందట