BigTV English

Tirumala VIP Free Darshan:  ఉచితంగా తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కావాలా? అయితే ఇలా చేయండి

Tirumala VIP Free Darshan:  ఉచితంగా తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కావాలా? అయితే ఇలా చేయండి

Tirumala VIP Free Darshan: తిరుమలలో మీకు ఉచితంగా వీఐపీ బ్రేక్‌ దర్శనం కావాలా… అది ఎవ్వరి రికమండేషన్‌ లెటర్‌ లేకుండా.. ఎటువంటి డోనేషన్స్‌ ఇవ్వకుండా శ్రీవారిని కనులారా దర్శించుకునే భాగ్యం కావాలా అయితే ఇలా చేయండి మీకు వీఐపీ బ్రేక్‌ దర్శనం తప్పకుండా లభిస్తుంది.


కలియుగ వైకుంఠం తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి రోజుకు వేల సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. అయితే స్వామి దర్శనానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ఉచిత దర్శనం. ఉచిత దర్శనం చేసుకోవాలంటే ముందు రోజు తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లేక్స్‌ లో ఇచ్చే టోకెన్స్‌ తీసుకోవాల్సిందే. ఒకవేళ ఈ టోకెన్స్‌ తీసుకోకుండా నేరుగా కొండ మీదకు దర్శనానికి వెళితే మాత్రం అప్పుడు శ్రీవారి దర్శనం కోసం గంటలు గంటలు వెయిట్‌ చేయాల్సి వస్తుంది.

ఇక రెండో మార్గం 300 రూపాయల టికెట్‌ దర్శనం. ఈ టికెట్లను టీటీడీ రెండు నెలల ముందే ఆన్‌లైన్‌ లో విడుదల చేస్తుంది. అప్పుడు టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా బుక్‌ చేసుకోవాలి. ఇక మూడో మార్గం వీఐపీ బ్రేక్‌ దర్శనాలు ఉంటాయి. అందుకోసం మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రికమండేషన్‌ లెటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా శ్రీవాణి ట్రస్ట్‌కు పదివేల రూపాయలు డొనేషన్‌ చేసిన భక్తులకు కూడా వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు.


ఇక వీఐపీ బ్రేక్‌ దర్శనం అన్ని దర్శనాల కన్నా చాలా సౌకర్య వంతంగా ఉంటుందని భక్తులు చెప్తుంటారు. అదీకాక ఈ వీఐపీ బ్రేక్‌ దర్శనంలో స్వామి వారిని మూడో గడప దగ్గర నుంచి కన్నులారా దర్శించుకోవచ్చు. ఈ దర్శనం ద్వారా తొపులాటలు ఉండవు.. కొద్ది నిమిషాల పాటు స్వామి వారిని కనులారా చూసే భాగ్యం కలుగుతుందని చెప్తుంటారు. అయితే ఇలాంటి వీఐపీ బ్రేక్‌ దర్శనం కూడా చాలా సింపుల్‌గా చేసుకునేందుకు భక్తులకు అవకాశం కల్పించింది టీటీడీ బోర్డు.    అయితే అందుకోసం మీరు ఎవరి సిపారసు లెటర్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగని శ్రీవాణి ట్రస్ట్‌కు డోనేషన్‌ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. అంతా ఉచితంగానే దర్శనం చేసుకోవచ్చు అలాగే ఉచిత వసతి కూడా టీటీడీ కల్పిస్తుంది.

ఉచిత వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఇలా చేయండి:  వీఐపీ బ్రేక్‌ దర్శనం ఫ్రీగా మీకు లభించాలంటే మీరు చేయాల్సిందల్లా మీ ఇంటి దగ్గరే గోవింద కోటి రాయడం. అవును మీరు చదువుతుంది నిజమే.. స్వామి వారిని భక్తితో స్మరిస్తూ ఇంటి దగ్గరే గోవింద కోటి రాసిన భక్తులకు వీఐపీ బ్రేక్‌ దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.

కండీషన్స్‌ అప్లయ్‌: అయితే గోవింద కోటి రాసిన అందరికీ వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించదు టీటీడీ. కేవలం 25 సంవత్సరాల లోపు ఉన్న యువతీయువకులే అర్హులు అని ప్రకటించిది. అయితే ఇందులో పది లక్షల వెయ్యి నూట పదహారు సార్లు గోవింద కోటి రాస్తే రాసిన ఒక్కరికే వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తుంది. అదే కోటి సార్లు రాస్తే రాసిన వ్యక్తి కుటుంబంలోని 5 మందికి ఉచిత వీఐపీ దర్శనం కల్పించడంతో పాటు తిరుమలలో వారికి ఉచిత వసతి ఏర్పాటు చేస్తుంది.

గోవింద కోటి బుక్స్‌ ఎక్కడ దొరుకుతాయి: గోవింద కోటి పుస్తకాలు తిరుమలలో టీటీడీ బుక్ స్టాల్స్‌, శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నసత్రం దగ్గర ఏర్పాటు చేసిన బుక్‌ స్టాల్‌, లేపాక్షి స్టాల్‌, శ్రీ టీటీ స్టాల్‌ ( ప్రధాన ఆలయం ఎదురుగా) అలాగే తిరుపతిలో కేటీ స్టాల్‌ ( ఏడీ బిల్డింగ్‌ ఎదురుగా), ధ్యాన మందిరం దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్‌, శ్రీనివాసం, విష్ణునివాసం దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్‌ లో అలాగే తిరుచానూరు దగ్గర ఉన్న పాట్‌ స్టాల్‌లో దొరుకుతాయి. అలాగే ప్రధాన బుక్‌ సెంటర్స్‌ లో కూడా బుక్స్‌ అందుబాటులో ఉంటాయి.

ALSO READ: పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉన్న పిల్లలు ఎక్కువగా ఆ రాశుల్లోనే పుడతారట

 

Related News

Bathukamma 2025: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !

Bathukamma 2025: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?

Goddess Durga: దుర్గాదేవిని ఈ ఎర్రటి పూలతో పూజిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయ్ !

Sabarimala: శబరిమల అయ్యప్ప ఆలయంలో 4.54 కేజీల బంగారం మాయం..

Navratri Gifts Ideas: నవరాత్రి స్పెషల్.. బహుమతులు ఇచ్చే క్రీయేటివ్ ఐడియాస్ మీకోసం

Navratri Fasting: నవరాత్రి తొమ్మిది రోజుల ఉపవాస రహస్యాలు.. తెలుసుకోవాల్సిన ఆహార నియమాలు

Navratri Fashion Trends 2025: నవరాత్రి 2025.. తొమ్మిది రోజుల తొమ్మిది రంగుల ప్రత్యేకత

Solar Eclipse 2025: 21న ఆకాశంలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ రింగ్ ఆఫ్ ఫైర్!

Big Stories

×