Zodiac Signs: పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు ఉన్న పిల్లలు ఎక్కువగా ఏ రాశుల్లో పుడతారో తెలుసా..? నూటికి తొంభై శాతం మంది గొప్ప నాయకులు కూడా ఆ రాశుల్లో పుట్టిన వారేనట. ఇంతకీ ఆ రాశులేవో తెలుసా..? మిగతా రాశుల్లో పుట్టిన వాళ్లు ఏఏ రంగాల్లో రాణిస్తారో తెలుసా..? ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలను ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశిలో పుట్టిన పిల్లలకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుందని పండితులు చెప్తున్నారు. అలా పన్నెండు రాశుల్లో పుట్టిన పిల్లలు ఏఏ రంగాల్లో స్థిరపడతారో ఏఏ లక్షణాలు కలిగి ఉంటారోనన్న విషయాలు కూడా జాతకం ఆధారంగా రాశిని బట్టి అంచనా వేయోచ్చంటున్నారు జ్యోతిష్యులు. ఏ రాశిలో పుట్టిన పిల్లకు ఏ లక్షణాలు అబ్బుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులకు తెలివి తేటలు అధికంగా ఉంటాయట. వీరికి ధైర్యం, తెగువ ఎక్కువగా ఉంటుందట. అలాగే ఈ రాశిలో పుట్టిన పిల్లలు స్కూల్‌లో ఫస్ట్ బెంచీ స్టూడెంట్స్ గా రాణిస్తారట. చదువులోనే కాకుండా సంస్కారంలో కూడా వీరికి ఎవరూ సాటి రారట.
వృషభ రాశి: ఈ రాశిలో పుట్టిన పిల్లలు నెమ్మదస్తులుగా ఉంటారట. ఏదైనా విషయం నేర్చుకోవడంలో స్థిరత్వం తక్కువగా ఉంటుందట. కొన్ని సందర్బాలలో బుద్ది మాంద్యం కలిగిన పిల్లలు ఎక్కువగా ఈ రాశిలోనే పుడుతుంటారట.
మిథున రాశి: ఈ రాశిలో జన్మించిన చిన్నారులు చాలా చురుకుగా ఉంటారట. ఎప్పుడూ చలాకీగా మాట్లాడతారట. ఎదుటి వారిపై ప్రశ్నల వర్షం కురిపించడంలో ఈ రాశి పిల్లలు దిట్ట అని పండితులు చెప్తున్నారు.
కర్కాటక రాశి: ఈ రాశిలో జన్మించిన పిల్లలు చాలా సున్నిత మనస్కులై ఉంటారు. చిన్న విషయాలకు కూడా భయపడుతుంటారు. కానీ ఇంట్లో వాళ్ల మీద అధికమైన ప్రేమ కలిగి ఉంటారు. ఇంకా చెప్పాలంటే అమ్మా నాన్నలను విడిచి నిమిషం కూడా ఉండలేరట.
సింహ రాశి: ఈ రాశిలో జన్మిచిన జాతకులకు తెలివి తేటలు ఎక్కువగా ఉంటాయట. రాశి పేరుకు తగ్గట్టే ఈ రాశిలో పుట్టిన పిల్లలకు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు సొసైటీలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్న వారందరూ మాక్సిమమ్ సింహరాశిలోనే పుట్టి ఉంటారని పండితులు చెప్తున్నారు.
కన్యా రాశి: ఈ రాశిలో పుట్టిన పిల్లలు పరిశుభ్రంగా ఉండటానికి బాగా ఇష్టపడతారట. అలాగే క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారట. పెద్దలంటే గౌరవం ఉంటుందట. చదువులోనూ వీరు రాణిస్తారట.
తులా రాశి: ఈ రాశి జాతకులకు కళలపై ఆసక్తి ఉంటుంది. సినిమా, నాటక రంగాలలో రాణిస్తారు. వీరికి అందంగా ఉండటం.. తయారవ్వడం అంటే మహా ఇష్టమట. అలాగే వీరు తెలివిలోనూ ఎవరికీ తీసిపోరట.
వృశ్చిక రాశి: ఈ రాశిలో పుట్టిన పిల్లలకు లోతుగా ఆలోచించే స్వభావం ఉంటుందట. ఏదైనా విషయాన్ని రహస్యంగా ఉంచడంలో వీరు ఆరితేరినవారట.
ధనస్సు రాశి: ఈ రాశిలో పుట్టిన పిల్లలు ఎక్కువగా ఎక్స్ ఫోజ్ అవ్వడానికి ఇష్టపడతారట. అలాగే చదువులోను చురుకైన విద్యార్థిగా రాణిస్తారు. వీరికి ప్రయాణం చేయడం అంటే ఎంతో ఇష్టమట.
మకర రాశి: ఈ రాశిలో పుట్టిన పిల్లలు ఎంతో పరణతితో ఆలోచిస్తారు. వీరు పెరిగి పెద్ద వారైనా కూడా వీరికి చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది. వీరు ఏదైనా పట్టు పడితే తెగే వరకు వదలరు.
కుంభ రాశి: ఈ రాశిలో పుట్టిన పిల్లలు విభిన్న రకాలైన ఆలోచనలు చేస్తుంటారు. వీరికి అధునిక టెక్నాలజీపై ఆసక్తి ఉంటుంది. టెక్నాలజీని వీరు బాగా ఆస్వాదిస్తారట.
మీన రాశి: ఈ రాశిలో పుట్టిన పిల్లలు ఎక్కువగా కలల ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. అభూత కల్పనతో ఒక్కోసారి భయపడుతుంటారు. అయితే వీరిలో సృజనాత్మకతత ఎక్కువగా ఉంటుంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: ఆ ఐదు రాశుల వాళ్ళు ఎవ్వరికీ అప్పు ఇవ్వకూడదట – ఇస్తే తిరిగి రావడం కష్టమేనట