Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 5వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: ఈరోజు మీ వృత్తి, వ్యాపారాలలో విశేషమైన మార్పులు చోటు చేసుకుంటాయి. నూతనోత్సాహంతో పనులు మొదలుపెడతారు నమ్మకమైన వ్యక్తులతో ముందుకు వెళతారు ప్రయాణాలలో తగుజాగ్రత్తలు తీసుకోగలరు స్త్రీమూలకంగా ధనలాభం, మీ పైఅధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఈరోజు మీ అదృష్టసంఖ్య 7, అదృష్ట రంగు: గోల్డ్ కలర్, మరిన్ని మంచి ఫలితాల కోసం దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి
వృషభ రాశి: ఆకస్మిక ధనలాభం సోదరులతో సత్సంబంధాలు కొనసాగించండి ఒక చెడు వార్త వినే అవకాశం. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. మాతృవర్గం వారితో విభేదాలు ఏర్పడుతాయి. అంతర్గత శతృవుల పీడ ఏర్పడుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఈరోజు మీ అదృష్టసంఖ్య 7, అదృష్ట రంగు కాషాయం. మరిన్ని మంచి ఫలితాల కోసం మహాలక్ష్మీ దేవి ఆలయాన్ని దర్శించండి.
మిథునరాశి: ఇవాళ మీకు అద్భతయోగం ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తి, వ్యాపారాలలో నూతన మార్పులు చేస్తారు. జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 కలసివచ్చే రంగు: గులాబీరంగు మరిన్ని మంచి ఫలితాల కోసం దత్త నామస్మరణ చేసుకోండి.
కర్కాటకరాశి: ఈరోజు మీరు ఋణ ప్రయత్నాలు చేస్తారు. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. మీపనుల్లో ఇతరుల సహకారం అందుతుంది. ఇంట్లో వేడుకలు జరుపుతారు. కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఊహించని ప్రమాదం నుండి తప్పించుకుంటారు. ఈరోజు మీ అదృష్టసంఖ్య:8 కలసివచ్చేరంగు: కాఫీకలరు.
సింహరాశి: ఈరోజు మీరు వృథా ప్రయాణాలు చేస్తారు. ఎదుటివారి ప్రవర్తన చిరాకు కలిగిస్తుంది. ఇతురలతో అనవసరమైన వాదనలు చేయడం ద్వారా అందరిలో పరువు పోతుంది. బార్యాభర్తల మధ్య విబేధాలు వస్తాయి. అందవలసిన ధనం సమయానికి అందుతుంది. ఈరోజు మీ అదృష్టసంఖ్య5, కలసివచ్చే రంగు: గంధంరంగు. మరిన్ని మంచి ఫలితాల కోసం సూర్యునికి బెల్లం నివేదించండి.
కన్యారాశి: కుటుంబంలో ఊహించని గొడవలు. అంతర్గత శతృవుల వల్ల నష్టం. మాతృమూర్తికి ఆనారోగ్య సమస్యలు. జీవిత భాగస్వామి వల్ల ఊహించని నష్టం. వాయిదాపడ్డ పనులు పూర్తి చేస్తారు. ఇతరులకు సహాయపడుతారు. ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శిస్తారు. ఈరోజు మీ అదృష్టసంఖ్య 6, కలసివచ్చే రంగు: తెలుపు రంగు. మరిన్ని మంచి ఫలితాల కోసం హనుమాన్ దర్శనం చేసుకోండి.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి: కొత్త ప్రయత్నాలు మొదలుపెడుతారు సంతానం విషయంలో విచారం. జీవిత భాగస్వామితో ఘర్షణలు. సోదరవర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. శతృవులను నిర్మూలిస్తారు. పిత్రార్జిత లాభం. నూతన పెట్టుబడులు భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. దూర ప్రయణాలతో అనుకున్న పనులు పూర్తవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, కలసివచ్చే రంగు: సిల్వర్ రంగు. మరిన్ని మంచి ఫలితాల కోసం కాలభైరవ అష్టకం పారాయణ చేయండి.
వృశ్చికరాశి: కాలం అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంది. అన్నింటా లాభం ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న పనులు పూర్తి చేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యమైన విషయాల్లో మీ సహచరుల సలహాలను పాటించండి. పెద్దవారికి ఎదురు చెప్పకుండా వారి దీవెనలు పొందండి. ఈరోజు మీ అదృష్టసంఖ్య 4, కలసివచ్చే రంగు: ఎరుపురంగు. మరిన్ని మంచి ఫలితాల కోసం శివాలయాన్ని సందర్శించండి.
ధనుస్సురాశి: మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలలో విజయం. పితృవర్గం వైపు నుండి ఒక దుర్వార్త వినే అవకాశం. ఆర్థికంగా అభివృద్ధి పొందుతారు. ఈరోజు మీ అదృష్టసంఖ్య 5, కలసివచ్చే రంగు: పసుపుపచ్చరంగు. శివనామస్మరణ చేయండి.
మకరరాశి: శుభకార్యాల కోసం ఖర్చులు చేస్తారు. పుణ్యక్షేత్రదర్శనం చేస్తారు. కళత్రలాభం. రుణ విముక్తి. గొంతు సంబంధమైన వ్యాధి వల్ల అస్వస్థత బంధువులతో కలసి వేడుకలు నిర్వహిస్తారు. సోదరులలో ఒకరితో విబేధిస్తారు. నీటి ప్రాంతంలో జాగ్రత్తగా ఉండండి. జీవితభాగస్వామితో విభేదించకండి ఈరోజు మీ అదృష్టసంఖ్య 1, కలిసివచ్చే రంగు: ముదురుపచ్చ, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
కుంభరాశి: మీ ప్రయత్నాలను కొందరు అడ్డుకుంటారు. స్త్రీ సంతాన విషయంలో శుభవార్త వింటారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త. ఎదుటి వారిని మోసం చేయాలని చూసి దొరికిపోతారు. కొత్త రుణాలు చేస్తారు. పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, కలసివచ్చే రంగు: నెమలిపించం రంగు. దుర్గాదేవి ఆలయంలో 9 పసుపుకొమ్ములు సమర్పించండి.
మీనరాశి: దూర ప్రయణాల వల్ల లాభం. మిత్రులతో కలిసి వ్యాపార ఆలోచనలు చేస్తారు. బంధువుల రాక సంతోషాన్ని కలిగిస్తుంది. ఒక శుభవార్త వింటారు. రాజకీయ పరంగా నిర్ణయాలలో మార్పులు చేస్తారు. అవసరాలకు సరిపడా ధనం అందుతుంది. ఒకవార్త మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తుంది సమయస్పూర్తితో వ్యవహరించండి. ఈరోజు మీ అదృష్టసంఖ్య 2, కలిసివచ్చే రంగు: లేత నీలంరంగు. ఆంజనేయస్వామికి దానిమ్మపండు సమర్పించండి.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే