BigTV English

OTT Movie : ఛీఛీ ఇదేం సినిమారా బాబూ… డైరెక్టర్ ను జైలుకు కూడా పంపిన మూవీ… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : ఛీఛీ ఇదేం సినిమారా బాబూ… డైరెక్టర్ ను జైలుకు కూడా పంపిన మూవీ… ఏ ఓటీటీలో ఉందంటే?

OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్‌లు, ఫ్రెంచ్ ఎక్స్‌ట్రీమిటీ జానర్‌లను ఇష్టపడే వారికి ఒక ఆసక్తికరమైన సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమాలో హింస ఎక్కువగానే ఉంటుంది. లైట్-హార్టెడ్ ప్రేక్షకులు దీనిని చుస్తే తట్టుకోవడం కష్టమే. ఇందులో ఉన్న కొన్ని అసభ్యకరమైన సీన్స్ వల్ల దర్శకుడు జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. ఈ సినిమా స్టోరీ కూడా రివర్స్ నేరేషన్ లో నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘Irreversible’ ఒక ఫ్రెంచ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా గాస్పర్ నోయ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో మోనికా బెల్లూచీ, విన్సెంట్ కాసెల్, ఆల్బర్ట్ డుపోంటెల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా రివర్స్ క్రానలాజికల్ నేరేషన్ (వెనక్కి కథ చెప్పడం)లో నడుస్తుంది. ఇది కథకు ఒక ప్రత్యేకమైన చిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఈ చిత్రం తీవ్రమైన హింస, 9-నిమిషాల అసభ్య సన్నివేశాల కారణంగా వివాదాస్పదమైంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పోటీపడిన ఈ సినిమా, స్టాక్‌హోమ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బ్రాంజ్ హార్స్ అవార్డును గెలుచుకుంది. IMDbలో 7.3/10 రేటింగ్ పొందినప్పటికీ, దీని క్రూరమైన కంటెంట్ కారణంగా కొందరు ప్రేక్షకులు కేన్స్ స్క్రీనింగ్ నుండి వాకౌట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, MUBI ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా 1 గంట 38 నిమిషాల నిడివి కలిగి, ఫ్రెంచ్ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

అలెక్స్ (మోనికా బెల్లూచీ) మార్కస్ (విన్సెంట్ కాసెల్) అనే ఈ జంట పారిస్‌లో నివసిస్తుంటుంది. వారి సంబంధం చాలా ఎమోషనల్ గా ఉంటుంది. కానీ మార్కస్ స్వభావం వల్ల వారి మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో అలెక్స్ గర్భవతి అని తెలుస్తుంది. ఆమె ‘An Experiment in Time’ అనే పుస్తకం చదువుతూ, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఒక రోజు ఈ జంట మార్కస్ స్నేహితుడు, అలెక్స్ మాజీ ప్రియుడు అయినటువంటి పియరీతో కలిసి ఒక పార్టీకి వెళతారు. పార్టీలో మార్కస్ మాదకద్రవ్యాలు వాడి, అలెక్స్‌తో అమర్యాదగా ప్రవర్తిస్తాడు. దీనితో ఆమె కోపంతో పార్టీని వదిలి ఒంటరిగా ఇంటికి వెళ్లడానికి నిర్ణయించుకుంటుంది.

Read Also : ఆణిముత్యం లాంటి కుర్రోడు… అమ్మాయేమో అరాచకం.. ఇద్దరూ కలిస్తే రచ్చ రచ్చే

ఇంటికి వెళుతున్నప్పుడు, అలెక్స్ ఒక అండర్‌పాస్‌లో లెటెనియా అనే వ్యక్తి ద్వారా దారుణంగా అఘాయిత్యానికి గురవుతుంది. దీనివల్ల ఆమె కోమాలోకి వెళ్తుంది. ఈ సీన్ 9 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ సన్నివేశాలు చూడటానికి కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో, మార్కస్ పియరీ పార్టీలోనే ఉంటారు. కానీ అలెక్స్ ఆసుపత్రిలో ఉన్న విషయం తెలిసిన తర్వాత, మార్కస్ ప్రతీకార దాహంతో రగిలిపోతాడు. అతను పియరీతో కలిసి లెటెనియాను కనిపెట్టడానికి పారిస్ అండర్‌వరల్డ్‌లోకి వెళతాడు.వారు “రెక్టమ్” అనే గే క్లబ్‌లో లె టెనియాను వెతుకుతారు. కానీ తప్పుగా మరో వ్యక్తిని లె టెనియాగా భావించి, మార్కస్, పియరీ ఆ వ్యక్తిపై క్రూరంగా దాడి చేస్తారు.

ఈ దాడిలో శాంతంగా ఉండే పియరీ, ఒక అగ్నిమాపక యంత్రంతో ఆ వ్యక్తి తలను నాశనం చేస్తాడు. ఇది సినిమా అత్యంత హింసాత్మక సన్నివేశాలలో ఒకటిగా ఉంటుంది. అయితే, వారు దాడి చేసిన వ్యక్తి నిజమైన లె టెనియా కాదని, నిజమైన నేరస్థుడు సమీపంలోనే నవ్వుకుంటూ ఉంటాడని తెలుస్తుంది. ఈ దాడి తర్వాత మార్కస్ గాయపడతాడు, పియరీ అరెస్టు అవుతాడు. సినిమా ముగింపు ఒక షాకింగ్ ట్విస్ట్ తో ముగుస్తుంది. వీళ్లు అసలు నేరస్తున్ని పెట్టుకుంటారా ? లేక స్టోరీ ఇలానే ముగుస్తోందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×