BigTV English

Zodiac Signs: ఏకాదశి నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం !

Zodiac Signs: ఏకాదశి నుంచి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం !

Zodiac Signs: ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తొలి ఏకాదశి పర్వదినాన్ని జులై 17న ఘనంగా జరుపుకోనున్నారు. ఏకాదశి రోజు నుంచి విష్ణువు నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి వెళతాడని చెబుతుంటారు. అందుకే దీనిని దేవశయని ఏకాదశి అని పిలుస్తారు. ఈ మాసంలో వివాహం, నిశ్చితార్థం, కర్మలు చేయడం నిషిద్ధం. ఏకాదశికి ఒక రోజు ముందు సూర్యుడు, కర్కాటక రాశిలో సంచరిస్తాడు. అక్కడ అప్పటికే బుధుడు, శుక్రుడు కలిసి లక్ష్మీనారాయణ యోగాన్ని సృష్టిస్తున్నారు.


అదే సమయంలో కర్కాటకంలో సూర్యుడి ప్రవేశం అనేక రాజ యోగాలను ఏర్పరుస్తుంది.
సూర్య, బుధుల కలయిక బుద్ధాదిత్యరాజయోగాన్ని, సూర్య శుక్రుడి కలయిక శుక్రాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఏకాదశి రోజు గ్రహాల అద్భుతమైన కలయిక రాశుల వారికి ఎంతో మేలు చేస్తుంది . ఒక పనిలో అదృష్టం మీకు వెన్నంటి ఉంటుంది. జీవితంలో సంతోషం పెరుగుతుంది. దేవశయని ఏకాదశి నుంచి ఏ రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి:
ఏకాదశి రోజు సూర్యుడు, శుక్రుడు,బుధుడు దగ్గరగా రావడం వల్ల మేష రాశి వారి జీవితంలో అనేక మార్పులు కలుగుతాయి. వృత్తిలో చాలా పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. సంపదను పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. అవివాహితులకు వివాహ ఘడియలు సమీపిస్తున్నాయి. జీవితంలో సానుకూల శక్తి సమకూరుతుంది. పోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. మీరు మీ జీవితాన్ని సౌకర్యాలతో గడుపుతారు.
వృషభ రాశి:
వృషభరాశి వారికి ఏకాదశి వల్ల శుభ సమయం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీరు జీవితంలోని అన్ని సమస్యల నుంచి బయటపడేందుకు అవకాశముంది. సామాజిక ప్రతిష్ట కూడా బాగా పెరుగుతుంది. మీరు ఆర్థికంగా ధనవంతులుగా ఉంటారు. మీరు చేసిన పనుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి కూడా లభిస్తుంది.
సింహ రాశి:
సింహరాశి వారికి దేవశయని ఏకాదశి నుంచి విష్ణు అనుగ్రహం లభిస్తుంది. నూతన ఆదాయ మార్గాలు వీరికి ఏర్పడతాయి. ధన ప్రవాహం కూడా పెరుగుతుంది. స్థిరాస్తిలో పెరుగుదల ఉంటుంది. శారీరక సౌకర్యాలు కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతికి అవకాశాలున్నాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు కఠినంగా ఉన్నప్పటికీ అవి మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్యర్థులు శుభ వార్తలు వింటారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది.

Also Read: తొలి ఏకాదశి పూజ, ఉపవాసం, పాటించాల్సిన నియమాలు


కన్యా రాశి:
కన్యా రాశి వారి జీవితంలో ఏకాదశి రోజు గ్రహాల అరుదైన కలయిక అనేక సానుకూల మార్పులను కలిగిస్తుంది. ఈ సమయంలో మీ ఉద్యోగ అన్వేషణ కూడా పూర్తవుతుంది. మీరు కెరీర్‌లో అపారమైన విజయాలను పొందేందుకు అవకాశం ఉంటుంది. సంతానం వైపు నుంచి శుభవార్తలు కూడా పొందుతారు. పాత పెట్టుబడులతో ఎంతో ప్రయోజనం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో అదృష్టవంతులు అవుతారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జీవితాల్లోని అన్ని కష్టాలు తొలగిపోతాయి.

Tags

Related News

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Big Stories

×