Gajakesari Yoga 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు 16 నవంబర్ 2024 శనివారం ఉదయం 3:17 గంటలకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 18 సోమవారం తెల్లవారుజామున 4:31 గంటలకు రాశి మార్పు చెందనున్నాడు. వృషభరాశిలో బృహస్పతి, చంద్రుని కలయిక గజకేసరి యోగాన్ని సృష్టిస్తుంది.
చంద్రుడు 16 నవంబర్ శనివారం ఉదయం 3:17 గంటలకు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి ఇప్పటికే వృషభరాశిలో ఉన్నాడు. వృషభరాశిలో బృహస్పతి , చంద్రుడి కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడనుంది. ఈ యోగం మొత్తం 12 రాశుల వారికి లాభాలను కలిగిస్తుంది. అంతే కాకుండా ఈ సంచారం ముఖ్యంగా 4 రాశుల వారికి అధిక ప్రయోజనం చేకూరుస్తుంది. ఆ 4 అదృష్ట రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
చంద్రుడు, బృహస్పతి కలయిక వల్ల ఏర్పడే గజకేసరి యోగం వృషభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశికి చెందిన వ్యాపారులకు ఇది మంచి సమయం. అలాగే వ్యాపారంలో ఆశించిన దానికంటే మెరుగ్గా ఆదాయం రావడం వల్ల మనస్సుకు ఆనందం కలుగుతుంది. కెరీర్‌లో పురోగతికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించేందుకు ఇది మంచి సమయం.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి వృషభ రాశిలో ఏర్పడే గజకేసరి యోగం వల్ల అద్భుత ప్రయోజనం కలుగుతుంది. ఈ వ్యక్తులు తమ ఆఫీసుల్లో భారీ లాభాలను పొందే అవకాశం ఉంది. కెరీర్‌లో పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయి. మీరు ఉద్యోగంలో మీ కష్టానికి పూర్తి ఫలితాలు పొందుతారు. కొత్త పనికి మంచి ప్రారంభం ఉంటుంది. ఇది భవిష్యత్తులో మంచి ఫలితాలను అందిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి వృషభ రాశిలో ఏర్పడే గజకేసరి యోగం అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా పెరుగుతుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు.
మీన రాశి:
చంద్రుడు, బృహస్పతి కలయిక మీన రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వ్యక్తులు ఆఫీసుల్లో సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. కుటుంబంలో ఉన్న సమస్యలు కూడా తీరుతాయి. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. డబ్బు పెట్టుబడి మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక పరిస్థితిలో బలం ఉంటుంది. అంతే కాకుండా వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. అంతే కాకుండా ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉండండి.