BigTV English

Akshay tritiya 2024: ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు గజకేసరి యోగం.. ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్లే..!

Akshay tritiya 2024: ఈ ఏడాది అక్షయ తృతీయ నాడు గజకేసరి యోగం.. ఈ రాశుల వారు నక్కతోక తొక్కినట్లే..!

Akshay tritiya 2024: ఈ సంవత్సరం, అక్షయ తృతీయ నాడు చాలా పవిత్రంగా భావించే గజకేసరి యోగం ఏర్పడుతోంది. ఈ యోగం 5 రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కురిపిస్తుంది. వారిని ధనవంతులను చేస్తుంది.


గజ్ కేసరి యోగం: వైశాఖ శుక్ల తృతీయ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజు వివాహం చేసుకోవడానికి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటానికి, బంగారం-వెండి, కారు, ఇల్లు కొనడానికి చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అంటే అక్షయ తృతీయ రోజున ఈ శుభకార్యాలన్నీ చేయడానికి ఏ శుభ ముహూర్తం వెతుక్కోనవసరం లేదు.

ఈ ఏడాది మే 10న అక్షయ తృతీయ పండుగను జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజున షాపింగ్‌తో పాటు దానధర్మాలు చేస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున గజకేసరి రాజయోగం ఏర్పడుతున్నందున ఈ రోజు ప్రాధాన్యత మరింత పెరిగింది. గజకేసరి యోగం ఏర్పడటంతో 5 రాశుల వారికి లక్ష్మీదేవీ అనుగ్రహం లభిస్తుంది. దీంతో పాటు ధన యోగం, శుక్రాదిత్య యోగం, రవియోగం, సుకర్మ యోగాలు అక్షయ తృతీయ నాడు ఏర్పడబోతున్నాయి. ఇది 5 రాశుల వారిని ధనవంతులను చేస్తుంది.అయితే ఆ 5 రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


వృషభం
వృషభ రాశి వారికి అక్షయ తృతీయ నాడు ధనలాభం కలుగుతుంది. మీరు జీవితంలో గొప్ప ఆనందాన్ని పొందుతారు. అధిక లాభాలను తెచ్చే కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ మెరుగుపడుతుంది.

మిథునం
అక్షయ తృతీయ నాడు ఏర్పడుతున్న శుభ యోగం మిథున రాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. మీకు ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో పూరోగతి ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి.

కర్కాటకం
కర్కాటక రాశి వారికి అక్షయ తృతీయ ఒక వరం అని అనుకోవచ్చు. వారి జీవితంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది. కోరుకున్న రంగంలో అవకాశాలు మొరుగుపడతాయి.

తుల
తుల రాశి వారికి అక్షయ తృతీయ అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు జీవితంలో విలాసాలు పొందుతారు. ఆర్థిక సమస్యలన్నీ తీరుతాయి. బంగారం కొనడం వల్ల చాలా లాభాలు వస్తాయి.

Also Read: వృషభరాశిలో గురు, శుక్రుల కలయిక.. ఈ 3 రాశుల వారికి రాజయోగమే..!

ధనుస్సు
అక్షయ తృతీయ నాడు ఏర్పడుతున్న శుభ యోగం ధనుస్సు రాశి వారికి గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయం మీకు అనేక విధాలుగా లాభాలను తెచ్చిపెడుతుంది. పెట్టుబడికి అనుకూలమైన సమయం. మంచి రాబడులు వస్తాయి. నిలిచిపోయిన డబ్బు అందుతుంది. ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×