BigTV English

Pawan Kalyan: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ అంత గొప్ప నటుడును కాదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ అంత గొప్ప నటుడును కాదు.. పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: ఏపీ ఎన్నికలు మరో 15 రోజుల్లో రాబోతున్నాయి. ప్రచారాలతో ఏపీ హీటెక్కిపోతుంది. అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు మాటలతో యుద్దాలు చేసుకుంటున్నారు. జగన్ అవినీతిని పవన్ కళ్యాణ్ ఎండగడుతుంటే.. పవన్ నాలుగుపెళ్లిలు అంటూ జగన్ విమర్శిస్తున్నారు. ఇలా ఏపీలో ప్రచార సభలు మరింత హీట్ ఎక్కిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పవన్.. తన ప్రచార సభల్లో ఇండస్ట్రీని కూడా లాగేస్తున్నారు. అందరి హీరోల ఫ్యాన్స్ ను తనవైపుకు తిప్పుకొనేలా మాట్లాడి.. అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా మరోసారి పవన్.. టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడారు. నేడు కాకినాడ రూరల్ సభలో పవన్ .. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి పేర్లను ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది.


“ముఖ్యంగా యువతకు చెప్తున్నాను. రౌడీయిజానికి, దాష్టికానికి భయపడితే మీరు ఎక్కడికి పారిపోతారు. నేను మీకు దైర్యం ఇవ్వడానికి వచ్చాను. ఏ దేశానికి పారిపోతారు. మీరు ఎన్ని హారతులు తీసినా.. మీ గుండెల్లో దైర్యం అనే జ్యోతిని వెలింగించకపోతే అదంతా వ్యర్థం అవుతుంది. మార్పు తీసుకురావడానికి వచ్చాను నేను.. వైఎస్ జగన్ ను గద్దె దించేవరకు మీరు ఎన్నిహారతులు తీసినా ప్రయోజనం లేదు. నేను ఎన్టీఆర్,ప్రభాస్, చిరంజీవి గారు, రామ్ చరణ్ లాంటి పెద్దనటుడుని కాకపోవచ్చు, కానీ నాకంటూ మార్కెట్ ఉంది, దాదాపు 200 కోట్లు గత 5 ఏళ్లలో సంపాదించి, 70 కోట్లకు పైగా ట్యాక్స్ కట్టగలిగే శక్తి ఉన్న వ్యక్తిని, అయినా సరే నేను మీ కోసం రాజకీయాల్లోకి వచ్చాను.

నేను ఇంత డబ్బు సంపాదించుకొని కూడా ఎందుకు రోడ్లపై తిరుగుతున్నాను అంటే నాకో భయం ఉంది. ఈ నెల కోసం కష్టపడే కొంతమంది వ్యక్తుల సమూహాం కావాలి.. అందుకే నేను నిలబడ్డాను” అంటూ పవన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియోను టాలీవుడ్ హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈసారి ఎన్నికల్లో పవన్.. టాలీవుడ్ మద్దతుతో గెలుస్తాడేమో చూడాలి.


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×