BigTV English

Katrina Kaif: అప్పుడు వదిలేసుకున్నా.. ఇప్పుడు ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా

Katrina Kaif: అప్పుడు వదిలేసుకున్నా.. ఇప్పుడు ఆ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా

Katrina Kaif: ఒకప్పుడు హీరోయిన్ల సక్సెస్ అంటే ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి వెళ్లడం. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ హీరోయిన్స్ బాలీవుడ్ లో అడుగుపెడితే గొప్ప సక్సెస్ అనుకునేవారు. కానీ,ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా దున్నేస్తున్నారు. ఇక ఇప్పుడు హీరోయిన్స్ చూపు అంతా హాలీవుడ్ మీద పడింది. అక్కడ ఒక్క ఛాన్స్ రావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా, అలియా భట్, శోభితా లాంటి వాళ్లు హాలీవుడ్ లో మొదటి అడుగు వేశారు. అయితే తాను కూడా ఈపాటికి హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాల్సింది.. కానీ కుదరలేదని బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ బాధపడిపోతోంది.


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే తనకన్నా చిన్నవాడైన విక్కీ కౌశల్ ను వివాహమాడి వివాహబంధంలోకి అడుగుపెట్టింది కత్రీనా. పెళ్లి తరువాత కూడా బ్రేక్ తీసుకోకుండా వరుస సినిమాలను చేస్తూ వస్తుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ భామ.. తన హాలీవుడ్ ఆఫర్ గురించి మొట్ట మొదటిసారి చెప్పుకొచ్చింది. ” నాకు హాలీవుడ్ ఆఫర్ కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వలన నేనే దాన్ని రిజెక్ట్ చేశాను. ఇప్పుడు అలాంటి ఆఫర్ రావాలని ఎదురుచూస్తున్నాను. ఒకసారి అవకాశాన్ని వదిలేశాక.. మళ్లీ అదే రావాలి అంటే కొంచెం టైమ్ పడుతుంది. నా జీవితంలో కొత్త పేజీని ఓపెన్ చేయాలనుకుంటున్నాను.

హిందీలో బూమ్.. తెలుగులో మల్లీశ్వరి ద్వారా పరిచయమయ్యాను. అక్కడనుంచే నేను అన్ని నేర్చుకున్నాను. కెమెరా ముందు ఎలా ఉండాలి అనేది.. ఆ తరువాత డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో ఎలా చర్చలు జరపాలి అన్నది నేర్చుకున్నాను. నేను ఏమైతే అనుకున్నానో అన్ని సాధించాను. నా లైఫ్ లో నా మొదటి స్థానం సినిమాకే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కత్రీనా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ముందు ముందు ఈ భామ హాలీవుడ్ ఆఫర్ ను పట్టేస్తుందేమో చూడాలి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×