Gajalakshmi rajyog: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, దేవగురు బృహస్పతి ప్రస్తుతం శుక్రుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే ఏడాది 2025లో బృహస్పతి తన రాశిని మార్చుకోనున్నాడు. బృహస్పతి వృషభం రాశి నుంచి బయటకు వెళ్లి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బృహస్పతి, శుక్రుడు జూలై 2025లో మిథునరాశిలోకి ప్రవేశించున్నారు. ఫలితంగా గురు-శుక్రులు కలిసి మిథునరాశిలో గజ లక్ష్మీ రాజయోగాన్ని సృష్టించనున్నారు.ఈ యోగం వల్ల 12 రాశుల వారు ప్రభావితం అవుతారు. ముఖ్యంగా 3 రాశుల వారు ఈ సమయంలో అద్భుత ఫలితాలను పొందనున్నారు.
దేవగురువు బృహస్పతి 14 మే 2025 రాత్రి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. సరిగ్గా 2 నెలల తర్వాత జూలై 26న ఉదయం 9 గంటలకు శుక్రుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆగస్ట్ 21, 2025 వరకు శుక్రుడు మిథునరాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో రెండు గ్రహాలు కలిసి గజ లక్ష్మీ రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. ఇది 3 రాశులకు భారీ ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
తులా రాశి:
ఈ రాశి వారికి గజలక్ష్మీ రాజయోగం వల్ల అద్భుత ఫలితాలు అందుతాయి. మీరు గజలక్ష్మీ రాజయోగం నుండి భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు. ఈ యోగం యొక్క శుభ ప్రభావం కారణంగా, ప్రేమ భాగస్వామితో ప్రేమ బంధం చాలా బాగా పెరుగుతుంది. ఇదే కాకుండా, ఆఫీసుల్లో పురోగతికి కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కృషి , అంకితభావంతో, మీరు పెద్ద బాధ్యతలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ రీత్యా చాలా ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. అంతే కాకుండా వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యులతో దూర ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. ఉన్నతాధికారుల నుంచి మీ పనికి ప్రశంసలు లభిస్తాయి.
సింహ రాశి:
గజలక్ష్మీ రాజయోగం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది.మీ ఆరోగ్యంలో పెద్ద మెరుగుదల ఉంటుంది. అలాగే వ్యాపారంలో పురోగతి కోసం వేసుకున్న ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు ఆఫీసుల్లో ప్రమోషన్‌తో పాటు ఇంక్రిమెంట్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎన్నో రోజులుగా మీరు చేయాలనుకున్న పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. అంతే కాకుండా అద్భుత ఉద్యోగావకాశాలు కూడా మీకు లభిస్తాయి. విద్యార్థులకు ఇది ఉద్యోగపరంగా మంచి సమయం. మీరు ఆర్థిక పరంగా తీసుకునే నిర్ణయాలు తప్పకుండా జాగ్రత్తగా తీసుకోవడం చాలా అవసరం.
Also Read: ఈ వారం ఈ రాశుల వారికి ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువ !
మిథున రాశి:
మిథున రాశి వారికి గజలక్ష్మీ రాజ్యయోగ శుభ ప్రభావం వల్ల కొత్త ఆదాయం లభిస్తుంది. శుక్రుడి శుభ ప్రభావం వల్ల ఈ వ్యక్తుల ప్రేమ సంబంధాలు బలపడతాయి. అంతే కాకుండా వ్యాపారస్తుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. అంతే కాకుండా మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అనుకున్న వారికి ఇది మంచి సమయం. ఉద్యోగస్తుకు కూడా ఆఫీసుల్లో మంచి అవకాశాలు అందుతాయి. అంతే కాకుండా ఆఫీసుల్లో మీ పనులకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు . విద్యార్థుకు కెరీర్ కు ఈ సయయం అనుకూలంగా ఉంటుంది.