Vishaka woman death : ఎవరైన కుటుంబ సభ్యలు చనిపోతే.. బాధ పడతాం. బంధువులకు, చుట్టుపక్కల వారికి చెప్పుకుని ఆవేదన చెందుతాం. అంతేకానీ.. ఎవరికీ చెప్పకుండా, ఒక్కరో, ఇద్దరో వెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేసి రారు. చివరి చూపులైన చూసి వెళ్లతారని.. చనిపోయిన వారి స్నేహితులకు, వారి తోటివారికి సమాచారం చేరవేరుస్తాం. కానీ.. విశాఖలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. నర్సింగ్ చదువుతున్న ఓ యువతి.. అనుకోకుండా చనిపోగా, ఆత్మహత్య చేసుకుందని చెబుతూ, సైలేంట్ గా దహనం చేశారో జంట. దాంతో.. అసలేం జరిగింది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విశాఖపట్నంలోని గోపాలపట్నంలో వారం రోజుల క్రితం భాగ్యశ్రీ అనే యువతి మృతి చెందింది. ఆమె ఆత్మహత్య చేసుకుందని చుట్టుపక్కల వారికి చెప్పారు.. ఆమె అన్నావదినలు. నిజమే అయి ఉండొచ్చని అంతా భావించారు. కానీ.. అప్పటికప్పుడే ఎవరీ చెప్పకుండా యువతి మృత దేహాన్ని ఆటోలో తీసుకుని వెళ్లారు. ఆసుపత్రికో, పోలీస్ స్టేషన్ కి వెళ్లారేమోనని చుట్టుపక్కల వాళ్లు భావించారు. కానీ.. తీరా వాళ్లు నేరుగా స్మశానంలోకి వెళ్లి.. ఆ యువతికి దహన సంస్కాలు చేశారు. అదీ.. సంప్రదాయబద్ధంగా జరగలేదు. ఎవరినీ పిలవకుండా, చెప్పకుండా.. ఆ యువతిపై పెట్రోల్ పోసి దహన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
ఇక ఈ విషయం క్రమంగా అందరికీ తెలియడంతో.. ఆ యువతి అన్నావదిల తీరుపై చుట్టుపక్కల వారికి అనుమానాలు మొదలయ్యాయి. ఇంట్లో ఆడపిల్ల చనిపోతే.. బాధ పడాల్సింది పోయి, ఆమె దహక కార్యక్రమాలు పూర్తయ్యాయిలే అనే విధంగా వారి తీరు ఉండడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. దాంతో.. యువతి భాగ్య శ్రీ మృతికి.. ఆమె అన్నావదినే కారణం అంటూ స్థానికులు పోలీసుల్ని ఆశ్రయించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అసలు విషయాన్ని రాబట్టే పనిలో ఉన్నారు.
మృతిచెందిన యువతి భాగ్యశ్రీ.. విశాఖలోని కేపీ వైద్యకళాశాలలో నర్సింగ్ చదువుతోంది. ఈమెకు.. తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో, అన్నావదినల దగ్గర ఉండి చదువుకుంటోంది. ఈ క్రమంలోనే.. ఆమె ఆత్మహత్య చేసుకుందని ఒక్కసారిగా ప్రచారం జరగడం, ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు అన్నావదినలు ప్రయాసపడడంతో.. వారే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి.
Also Read : మంచిర్యాలలో దారుణం.. పెళ్లైన మహిళతో పారిపోయిన కొడుకు.. తండ్రిని హత్య చేసిన భర్త!
ఇప్పటికే.. విషయం పోలీసులకు చేరడంతో, దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసుల అన్ని కోణాల్లో కేసును కూపీ లాగుతున్నారు. త్వరలోనే ఈ కేసులో పూర్తి సమాచారాన్ని రాబడతామని ప్రకటించిన పోలీసులు.. దోషులుగా ఎవరైనా తేలితే, కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు.