BigTV English

Saturn Transit: శని సంచారం.. ఈ 3 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

Saturn Transit: శని సంచారం.. ఈ 3 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

Saturn Transit: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని తిరోగమనం, ప్రత్యక్షంగా మారే సంఘటనలు చాలా ముఖ్యమైనవి. శని తిరోగమనం వల్ల కలిగే శుభ, అశుభ ప్రభావాలు 12 రాశులపై పడతాయి. శని తన రాశిలో సుమారు రెండు సంవత్సరాలు ఉంటాడు. ఈ సంవత్సరం శనిదేవుడు ఏడాది పొడువునా కుంభ రాశిలోనే ఉంటాడు. జూన్ 30న శని కుంభ రాశిలో తిరోగమన దిశలో సంచరిస్తున్నాడు. శని తిరిగి 139 రోజుల తర్వాత నవంబర్ 15 2025 రాత్రి 7:51 గంటలకు నేరుగా కుంభ రాశిలోకి వస్తుంది.


ఫలితంగా కొన్ని రాశుల వారికి ధనలాభం కలుగుతుంది. న్యాయదేవుడైన శనీశ్వరుడి ప్రత్యక్ష సంచారం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
కుంభ రాశిలో శని ప్రత్యక్షంగా ఉండడం వల్ల ఆ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ కాలంలో మీరు కేరీర్, వ్యాపారంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది. ఇది మీ కలలు నెరవేరే సమయం. మీ సామాజిక హోదా, ప్రతిష్ట కూడా పెరుగుతుంది. కెరీర్‌లో మంచి విజయాలతో ముందుకు వెళతారు. సంపద కూడా బాగా పెరుగుతుంది. కోర్టు కేసులో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా మనస్సుకు కూడా ప్రశాంతత కలుగుతుంది.
మిథున రాశి:
మిథున రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.మీ జీవితంలో చాలా సానుకూలమైన మార్పులు కనిపించే అవకాశముంది. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. వివాహ జీవితం బాగా మెరుగుపడుతుంది. సమాజంలో ప్రశంసలు అందుకుంటారు. మీరు వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. శనిదేవుడి అనుగ్రహంతో మీ కార్యాలన్నీ విజయవంతమవుతాయి. మీరు ఉద్యోగం, వ్యాపారంలో చాలా పురోగతి సాధించే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీరు జీవితంలోని అన్ని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. మీకు కొత్త జాబ్ ఆఫర్ వస్తుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు బాగా ఏర్పడతాయి. వృత్తిలో వస్తున్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి.మీ పురోగతికి మార్గం సులభం అవుతుంది.

Also Read: శ్రావణ మాసం ఈ రాశుల వారికి ‘అత్యంత అదృష్టం’


కుంభ రాశి:
శని ప్రత్యక్ష సంచారం వల్ల కుంభ రాశి వారి జీవితంలో సంతోషం కలుగుతుంది. ఈ కాలంలో ఉద్యోగ, వ్యాపారంలో ఆటంకాలు కూడా తొలగిపోతాయి. కెరీర్లో కొత్త విజయాలు సాధించే అవకాశముంది. సమాజంలో మీకు ఎంతో గౌరవం లభిస్తుంది. బంధువులతో ఉన్న చేదు అనుభవాలు కూడా తొలగిపోతాయి. తల్లిదండ్రుల నుంచి మద్దతు కూడా లభిస్తుంది. కొత్త ఆదాయ వనరుల ద్వారా ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంది. మీ కలలన్నీ నిజమయ్యే సమయం ఇది. వైవాహిక జీవితంలో గొడవలు సద్దుమణిగే అవకాశం ఉంది. ఆస్తి విషయంలో కొనసాగుతున్న వివాదాలు పరిష్కారమవుతాయి. మీ మనస్సు కూడా ఆనందంగా ఉంటుంది. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. సంతోషకరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు బాగా పెరుగుతాయి. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం పొందుతారు.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×