BigTV English

Tirumala : తిరుమలకి వెళ్తున్నారా…ఈ నాలుగు తప్పులు చేయకండి

Tirumala : తిరుమలకి వెళ్తున్నారా…ఈ నాలుగు తప్పులు చేయకండి
Tirumala


Tirumala : ఈ కలియుగంలో భూలోకంలో కష్టాలు తీర్చే భగవంతుడు వెంకటేశ్వర స్వామి మాత్రమేనని శ్రీవారి భక్తుల నమ్మకం. అందుకే ఎంతో శ్రమపడి ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్తుంటారు. మొక్కులున్నవారు కాలినడకన తిరుమలకి వెళ్తుంటారు. తిరుమల లాంటి యాత్ర చేసినప్పుడు ఫలితం కలగాలంటే నాలుగు తప్పులు చేయకూడదు. తిరుమలేశుడి దర్శనం ప్రతీ ఒక్కరు చేసుకుంటారు. కానీ అంతకన్నాముందు వరాహస్వామిని దర్శించుకోవాలి. ఆతర్వాత వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాలి. వాస్తవానికి తిరుమల శ్రీనివాసుని క్షేత్రం కాదు వరాహస్వామిది. ఈ క్షేత్రంలో ఉండటానికి వెంకటేశ్వరుడు వరాహస్వామికి ఇచ్చిన ప్రమాణం ప్రకారం మొదట దర్శనం వరాహస్వామినే దర్శించుకోవాలి. తిరుమలలో మొదటి దర్శనం, పూజ, నైవేద్యం వరాహస్వామికే దక్కుతుందని రుమలేశుడు ప్రమాణపత్రం కూడా రాసిచ్చాడు. తిరుమల అర్చకస్వాములు మొదటి తప్ప మిగిలిన రెండింటిని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఆ మొదటిది పాటించాల్సింది తిరుమల వెళ్లే భక్తులే.

వరాహస్వామిని దర్శించిన తర్వాతే తనను దర్శనానికి రావాలని…అప్పుడే అది తనకు సంతృప్తి ఇస్తుందని స్వామి చెప్పాడు. ఆ మాటను భక్తులు పాటించకపోతే తిరుమల యాత్రకి వెళ్లి ఫలితం కలగదంటారు పెద్దలు. అలాగే తిరుమలను విహార యాత్రగానో మరోరకంగా భావించి వెళ్లకూడదు. ప్రాపంచిక సుఖాల కోసం అసలు వెళ్లకూడదు. పెళ్లైన ఆరు నెలల వరకు పుణ్యక్షేత్రాలకు వెళ్లకూడదన్న నియమం మన పెద్దలు పెట్టడానికి కారణం కూడా ఇదే. పెళ్లైన వారి ఆలోచన ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే.
అలాగే తిరుమల వెళ్లి దొంగ దర్శనాలు చేసుకోకూడదు.
మోసాలు చేసి దర్శనాలు చేసుకుంటే ఆఫలితం కలుగదు.


మాఢవీధుల్లో చెప్పులు ధరించి ఎట్టి పరిస్థితుల్లోను తిరగకూడదు. ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వీధులు పరమ పవిత్రమైనవి. రామానుజాచార్యుల వారు చేసిన శాసనాల ప్రకారం తిరుమలలో మహిళలు జడలో పూలు పెట్టుకోకూడదు . తిరుమలలో పూసిన ప్రతీ పువ్వు స్వామి వారి కైంకర్యాలకి మాత్రమే ఉపయోగపడాలి. స్వామికి ఉపయోగించిన నిర్మాల్యాలను కూడా ఎవరికి ఇవ్వకుండా భూతీర్థంలో చూపించి అడవిలో వదిలిపెడుతుంటారు. ఈనాలుగు తప్పు చేసి తిరుమల యాత్ర చేసినా ఎలాంటి ఫలితం కలగదన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి.

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×