BigTV English

Gupt Navratri :  గుప్త నవరాత్రుల్లో జరిగే ఐదు అద్భుతాలు

Gupt Navratri :  గుప్త నవరాత్రుల్లో జరిగే ఐదు అద్భుతాలు

Gupt Navratri : మనకి తెలుసు దసరా శరన్నవ రాత్రులు మాత్రమే. కానీ ఏడాదికి నాలుగు నవరాత్రులు వస్తుంటాయి. ఆశ్వయుజంలో మాసంలో చేసేది శరన్నవరాత్రి, చైత్రం మాసంలో వచ్చేది రెండో నవరాత్రి, ఆషాడమాసంల పాడ్యమి ముందు వచ్చేవి గుప్త నవరాత్రులు. వీటినే వారాహి నవరాత్రులుగా చెబుతారు. మాఘమాసంలో వచ్చేవి శ్యామలా నవరాత్రులు. వారాహి మాతను నవరాత్రులు పూజిస్తే ఐదు అద్భుతాలు జరుగుతాయి. ఆర్ధిక కష్టాల్లో మునిగిపోయిన వారు, భూ సంబంధిత కష్టాలతో బాధపడేవారు, రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉన్న వారు భవిష్యత్ బాగుండాలనే అమ్మవారి ఉపసాన చేస్తే వారి జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి.


శత్రుబాధలతో పడేవారు వారాహిమాతను పూజిస్తే విజయమే. శత్రు నాశనం జరిగిపోతుంది. కాకపోతే అలాంటి పూజ చేయకుండా సాత్వికమైన ఉపవాసన చేసి శత్రువు ఆలోచనలు మార్చమని కోరుకుంటే చాలు. వారాహి మాత సస్యశ్యామలం కలిగిస్తుంది. అందుకే అమ్మవారికి చేతిలో ఒక చేతిలో నాగలి, మరో చేతిలో రోకలి ఉంటుంది. పంటలను కాపాడే దేవత సస్యదేవత. తమ మీద మంత్రాలు ప్రయోగించారని అనుమానంతో బాధపడే వారు అమ్మవారిని పూజిస్తే అలాంటివి ఏమైనా ఉంటే పటాపంచలైపోతాయి. బ్లాక్ మేజిక్ లాంటి జరిగి కష్టాల్లో ఉన్నామని బాధపడే వారు అమ్మవారికి పూజ చేస్తే వాటి నుంచి బయటపడతారని శాస్త్రం చెబుతోంది.

ఎన్నో మందులిచ్చినా తగ్గని మొండివ్యాధులు అమ్మవారిని పూజిస్తే నయమవుతాయని శాస్త్రం చెబుతోంది. ఒంట్లో అంతా బాగానే ఉన్నా ఏదో సమస్య ఉందని బాధపడే వారు వారాహి దేవిని సక్రమంగా పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. కారణం అమ్మవారు ఉండే రథంపై ధన్వంతరి, అశ్వీనీదేవతలు కొలువుదీరి ఉంటారు. వారాహి మాతకి సూర్యాస్తమయం తర్వాత ఆరాధన చేయాలి. ధూపంతో అమ్మవారి ప్రీతి కలుగుతుంది. అగరబత్తీల కన్నా ధూపం మంచి ఫలితాన్ని ఇస్తుంది.


Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×