BigTV English

Plant For Money: ఇంట్లో ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటే ఈ మొక్కను పెంచండి

Plant For Money: ఇంట్లో ఆర్థిక సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉంటే ఈ మొక్కను పెంచండి
ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతున్నా, ఇంట్లో ప్రశాంతత లేకపోయినా వాస్తు లోపం వల్ల కావచ్చని ఎంతోమంది అంటూ ఉంటారు. మీ ఇంట్లో కూడా సంపాదించిన డబ్బు నిలబడకపోయినా, అతిగా ఖర్చులు అవుతున్నా, అప్పుల పాలు అవుతున్నా కూడా వాస్తు దోషాలు ఉన్నాయేమో అని చెక్ చేసుకోవడం ఉత్తమం. అలాగే మీ వాస్తు దోషాన్ని సులభంగా తొలగించే మొక్కను కూడా ఇంట్లో పెంచుకోవచ్చు.
క్రాస్సులా ప్లాంట్ (Crassula Plant)
ఈ మొక్క పేరు కాస్త కొత్తగా ఉంటుంది. కానీ అన్ని నర్సరీలలో కూడా ఇది దొరుకుతుంది. దీని పేరు క్రాస్సులా ప్లాంట్. దీన్ని జేడ్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది చిన్న మొక్కే. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు తొలగిపోతాయని చెబుతారు.
చైనా ప్రజల నమ్మకం ఇదే..


చైనాలో ఫెంగ్ షూయ్‌ను అని వాస్తు పిలిచే శాస్త్రాన్ని ఫాలో అవుతారు. క్రాసుల మొక్కను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు చాలా వరకు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ మొక్క ధనాన్ని ఆకర్షిస్తుందని చెప్పుకుంటారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచి నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుందని అంటారు. కాబట్టి మీ ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవడానికి ప్రయత్నించండి. దీనికి ఎక్కువ నీరు పోయాల్సిన అవసరం కూడా లేదు. రోజుకు అర గ్లాసు నీరు పోసినా చాలు, అవి కూడా ఎక్కువేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మొక్కలు చాలా చిన్నవిగా ఉంటాయి. సులభంగా ఇంట్లో పెంచుకునేలా ఉంటాయి.

ఇంటి లోపలే పెంచుకోవచ్చు


ఈ క్రాసులా ప్లాంట్ అన్ని నర్సరీలలో లభిస్తాయి. ఆకులు మందంగా, చిన్నగా ఉంటాయి. ప్రతిరోజూ గంట నుంచి రెండు గంటల పాటు ఈ మొక్కపై సూర్యకిరణాలు పడితే చాలు మిగతా సమయం ఇంట్లోనే పెట్టుకోవచ్చు. దీన్ని ఇండోర్ ప్లాంట్ గా కూడా చెప్పుకుంటారు. ఈ సూర్యకిరణాలు పడితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఇది అందిస్తుందని అంటారు. అలాగే ఇంట్లోనే దోషాలను కూడా సరిచేస్తుందని చెప్పుకుంటారు. ధనాన్ని ఆకర్షించే శక్తి ఈ మొక్కకు ఉందని అంటారు. ఆర్థిక సమస్యలు వెన్నాడుతున్నప్పుడు ఈ మొక్కను కొని పెట్టుకునేందుకు ప్రయత్నించండి.

వాస్తు దోషాలకు కారణాలు అనేకం.. 

వాస్తు దోషాలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇల్లు, ఇంట్లోని వస్తువులు ఉండాల్సిన ప్రదేశాల్లో కాకుండా గజిబిజిగా ఉన్నా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంట్లోనే ఎక్కడా కూడా రెండు అద్దాలను ఒకదానికి ఒకటి ఎదురుగా పెట్టకండి. దీనివల్ల కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ విపరీతంగా పెరిగిపోయి కష్టాలు వస్తాయి. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా కూడా అద్దం లేకుండా చూసుకోండి. ఇలా అద్దం పెడితే నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. ప్రధాన ద్వారానికి ఎదురుగా వినాయకుడి బొమ్మ ఉండేలా చూసుకోండి. ఇది ఇంటికి ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లో కచ్చితంగా తులసి మొక్క ఉండేలా జాగ్రత్త పడండి. వాస్తు నిపుణులకు సంప్రదించి ఇంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి.

మనీ ప్లాంట్ కూడా మంచిదే.. 

ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకోవడానికి కూడా ప్రయత్నించండి. మనీ ప్లాంట్ కూడా ఇంటికి ధనాన్ని ఆకర్షిస్తుందని చెప్పుకుంటారు. తులసి మొక్క, క్రాసులా ప్లాంట్ , మనీ ప్లాంట్… ఇవి ఇంటికి లక్ష్మీదేవిని తెచ్చి పెడతాయి. అయితే ముళ్ల మొక్కలను మాత్రం ఇంట్లో మాత్రం ముళ్ల మొక్కలు లేకుండా చూసుకోండి. పెద్ద చెట్లను చిన్న కుండీల్లో పెంచడం వంటివి చేయకండి. ఇవన్నీ కూడా ధనాన్ని అడ్డుకుంటాయి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×