BigTV English
Advertisement

Salman Khan: ఆ సినిమాలో ఫ్రీగా నటించిన సల్మాన్ ఖాన్.. భాయ్‌ది ఎంత పెద్ద మనసు!

Salman Khan: ఆ సినిమాలో ఫ్రీగా నటించిన సల్మాన్ ఖాన్.. భాయ్‌ది ఎంత పెద్ద మనసు!

Salman Khan: మామూలుగా సినీ సెలబ్రిటీలు పక్కా కమర్షియల్‌గా ఉంటారని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. చాలామంది నిర్మాతలు కూడా ఇప్పటికే ఈ విషయంపై ఓపెన్‌గా కామెంట్స్ చేశారు. నటీనటులు రెమ్యునరేషన్ లేకుండా ఏ పని చేయరని, ఒక చిన్న ఈవెంట్‌కు రావాలన్నా పేమెంట్ ఉండాల్సిందే అని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కానీ ఇలాంటి పక్కా కమర్షియల్ ఆర్టిస్టుల్లో కూడా పెద్ద మనసు ఉంటుంది. వారికి నచ్చిన లేదా దగ్గరయిన వారికోసం నటీనటులు ఒక్కొక్కసారి ఫ్రీగా నటిస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ కూడా అదే పనిచేశాడు. వరుణ్ ధావన్ కోసం ఒక సినిమాలో ఫ్రీగా నటించాడు.


గెస్ట్ రోల్ రివీల్

వరుణ్ ధావన్ హీరోగా నటించిన సినిమా ‘బేబి జాన్’. కలీస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ సినిమాపై బాలీవుడ్‌లో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ‘బేబి జాన్’ను మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం మేకర్స్ కష్టపడుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ నిర్మించారు. అట్లీ తమిళంలో తెరకెక్కిన ‘తేరీ’ అనే సినిమాకు ‘బేబి జాన్’ రీమేక్‌గా తెరకెక్కింది. ఈ మూవీని ప్రమోట్ చేస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ ఇందులో ఒక గెస్ట్ రోల్‌లో కనిపించారని మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయం ఆడియన్స్‌లో మరింత బజ్ క్రియేట్ చేసింది.


Also Read: ఆస్కార్ ఛాన్స్ మిస్ చేసుకున్న ‘లాపతా లేడీస్’.. రియాక్ట్ అయిన టీమ్

సల్మాన్ సాయం

మామూలుగా బాలీవుడ్‌లో ఒక హీరో కోసం మరొక హీరో వచ్చి సినిమాల్లో గెస్ట్ రోల్ చేయడం చాలా కామన్. అలాగే సల్మాన్ కూడా ఇంతకు ముందు ఎన్నో సినిమాల్లో గెస్ట్ రోల్స్‌లో నటించాడు. అలాగే ‘బేబి జాన్’లో కూడా తను ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పాత్రలో నటించడం కోసం సల్మాన్ ఖాన్ అసలు ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. వరుణ్ ధావన్ కోసం ఈ సినిమాలో ఫ్రీగా గెస్ట్ రోల్ చేశాడట సల్మాన్. ఇది మాత్రమే కాదు.. షారుఖ్ ఖాన్ సినిమాల్లో గెస్ట్ రోల్ చేయాలన్నా కూడా సల్మాన్ అస్సలు పారితోషికం తీసుకోడని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి.

కీర్తి సురేశ్ డెబ్యూ

‘బేబి జాన్’లో వరుణ్ ధావన్ సరసన కీర్తి సురేశ్ నటించింది. సౌత్‌లో హీరోయిన్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కీర్తి సురేశ్‌కు హిందీలో ఇదే మొదటి సినిమా. ఈ మూవీలో కీర్తితో పాటు వామికా గబ్బి కూడా హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే వరుణ్, కీర్తి, వామికా కలిసి ‘బేబి జాన్’ కోసం గట్టిగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. కీర్తి సురేశ్ ఒకవైపు తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఫాలో అవుతోంది. అందుకే ‘బేబి జాన్’ సూపర్ హిట్ అని వరుణ్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×