E-Paper
Advertisement

Pushpa 2 Press Meet : అల్లు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… “పుష్ప పార్ట్ 3″పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Pushpa 2 Press Meet : అల్లు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… “పుష్ప పార్ట్ 3″పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Advertisement

Pushpa 2 Press Meet : చాలాకాలం నుంచి అల్లు అర్జున్ అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ గురించి ఎట్టకేలకు నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. తాజాగా ప్రెస్ మీట్ లో ఈ మూవీని ఒకరోజు ముందుగానే థియేటర్లలోకి తీసుకురాబోతున్నాం అంటూ అభిమానులకు తీపి కబురు చెప్పారు నిర్మాతలు. అంతేకాకుండా తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో పాటు సినిమా షూటింగ్, ప్రమోషన్స్, పార్ట్ 3 (Pushpa 3)పై కూడా క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు.

‘పుష్ప 3’పై అప్డేట్…

Advertisement

2021 ఆగస్టులో రిలీజ్ అయిన ‘పుష్ప ది రైజ్’ (Pushpa 2) మూవీ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. అలాగే అల్లు అర్జున్ కు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి ఈ మూవీ సీక్వెల్ రిలీజ్ డేట్ గురించి అల్లు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ‘పుష్ప 2’ మూవీ దాదాపు మూడేళ్లుగా సెట్స్ పైనే ఉంది. సుకుమార్ పర్ఫెక్షన్ పేరుతో ఈ సినిమాను ఏళ్ల పాటు చెక్కుతూనే ఉన్నాడు. ఇక మూవీ రిలీజ్ డేట్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా, డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నాము అంటూ మూవీ ప్రీపోన్ డేట్ ను ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. అందులో భాగంగానే చాలా కాలంగా ‘పుష్ప 3’ ఉండబోతోంది అని విన్పిస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. పార్ట్ 3 (Pushpa 3) చేయడానికి ఆస్కారం ఉందని, స్టోరీలో ఆ ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు. నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ ‘పుష్ప 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చే ఆదరణను బట్టి పుష్ప 3 చేయాలా వద్దా అని డిసైడ్ అవుతాము’ అని క్లారిటీ ఇచ్చారు.

ప్రమోషన్స్ అప్పుడే…

Advertisement

ఇక పనిలో పనిగా సినిమా ప్రమోషన్స్ ను నవంబర్ లో స్టార్ట్ చేయబోతున్నామని చెప్పుకొచ్చారు. రెండు పాటలతో పాటు ట్రైలర్ ను కూడా నవంబర్లోనే రిలీజ్ చేసే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు, అలాగే ప్రమోషన్స్ లో ఎక్కువ శాతం నార్త్ పై ఫోకస్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ముంబైలో పెట్టే ఛాన్స్ ఉందని, ఓవర్సీస్ లో కూడా ప్లాన్ చేస్తుండగా సాంగ్స్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ ఉండొచ్చని వెల్లడించారు. ఇక సినిమా రిలీజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ గురించి మాట్లాడుతూ 1000 కోట్లు దాటిన మాట నిజమేనని చెప్పి ఆశ్చర్యపరిచారు మేకర్స్.

జాతర షూటింగ్ హైలెట్

అలాగే ఈ సినిమాలో కీలకపాత్రను పోషించబోతున్న జాతర సీన్స్ ను చిత్రీకరించడానికి 35 రోజులు పట్టిందని వెల్లడించారు. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఎంత భారీగా ఖర్చు చేశారో అంత బాగా సీన్స్ వచ్చాయంటూ మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచేశారు. అంతేకాకుండా ఈ మూవీకి ప్రస్తుతం ఉన్న మేనియాను దృష్టిలో పెట్టుకొని చూస్తే ‘బాహుబలి’ ఓపెనింగ్స్ ను క్రాస్ చేయడంతో పాటు ఆ మూవీ రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పుకొచ్చారు మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మాత నవీన్ ఎర్నేని (Naveen Yerneni). మొత్తానికి ఒక్క ప్రెస్ మీట్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×