E-Paper
Advertisement

Hanuman Jayanti : ఏడాది రెండు సార్లు హనుమాన్ జయంతి ఎందుకంటే….

Hanuman Jayanti : ఏడాది రెండు సార్లు హనుమాన్ జయంతి ఎందుకంటే….
Advertisement
Hanuman Jayanti

Hanuman Jayanti : అంజన పుత్రుడిగా దర్శనమిచ్చే హనుమంతుడు నిజానికి ప్రతివ్యక్తిలో నిద్రాణమైన ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక. సూప‌ర్ హీరోగా ఆంజనేయుడ్ని పూజిస్తారు. హిందూ పురాణాల్లో హ‌నుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. సీతాదేవిని లంక నుండి తీసుకువ‌చ్చేందుకు రాముడికి హ‌నుమంతుడు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాడు. ఏకంగా కొండ‌నే త‌న ఒంటి చేత్తో లేపే సామ‌ర్థ్యం హ‌నుమంతుడి సొంతం. పొడ‌వాటి తోక‌తో కండ‌లు తిరిగిన దేహంతో క‌నించే హ‌నుమంతుడి ఆకారం అందుకే పిల్ల‌లు కూడా ఎక్కువ‌గా హ‌నుమంతుడిని ఇష్ట‌ప‌డుతుంటారు.

వారంలో ప్ర‌తి మంగ‌ళ‌వారం, శనివారాల్లో హ‌నుమంతుడిని కొలుస్తుంటారు. హ‌నుమాన్ జయంతిని కూడా హిందువులు ఓ పెద్ద పండుగలా జ‌రుపుకుంటారు. అయితే హ‌నుమాన్ జ‌యంతి ఇత‌ర పండ‌గ‌ల్లా కాకుండా ఏడాదికి రెండు సార్లు వ‌స్తుంది. అలా రెండు సార్లు హ‌నుమాన్ జ‌యంతి రావ‌డం వెన‌క రెండు కార‌ణాలు ఉన్నాయి.. రామాయ‌ణం ప్ర‌కారం సీతాదేవిని రావ‌ణుడు తీసుకువెళ్లిన‌ప్పుడు రాముడు హ‌నుమంతుడితో క‌లిసి వెత‌కడం మొద‌లు పెడ‌తాడు. ఈ క్ర‌మంలో హ‌నుమంతుడు మంగ‌ళవారం నాడు సీతా దేవి ఆచూకీని క‌నుగొంటాడు.

Advertisement

ఆ రోజు చైత్ర‌మాసం చిత్త న‌క్షత్రం పౌర్ణ‌మి. ఆ రోజున హ‌నుమంతుడు అశోక‌న‌గ‌రాన్ని నాశ‌నం చేయ‌డంతో పాటు లంక‌ను త‌గ‌ల‌బెడతాడు. ఆ రోజున హ‌నుమంతుడి విజ‌యంగా చెప్పుకుని హ‌నుమాన్ జ‌యంతిని జ‌రుపుకుంటారు. ఇది ప్ర‌తి సంవ్స‌రం ఏప్రిల్ లో వ‌స్తుంది. కానీ అస‌లైన హ‌నుమాన్ జ‌యంతిని వైశాఖ మాసం శుక్ల ద‌శ‌మి రోజున జ‌రుపుకోవాలి. ఇది మే నెల చివ‌రిలో వ‌స్తుంది. పూర్వ‌భాద్ర‌ న‌క్షత్రంలో హనుమంతుడు జ‌న్మిస్తాడు. ఇది అస‌లైన హ‌నుమాన్ జ‌యంతి. ఇలా ఏడాదిలో హ‌నుమాన్ జ‌యంతిని రెండు సార్లు జ‌రుపుకుంటారు. కేరళలో మాత్రం మార్గశిర మాసంలో హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. అదే విధంగా కార్తీక మాసంలోని క్రిష్ణ పక్షంలో చతుర్దశి రోజున కూడా ఈ పవన పుత్రుని జయంతి వేడుకలను జరుపుకుంటారు.

ఈ పవిత్రమైన రోజున సూర్యోదయం సమయంలో ఆంజనేయుడిని ఆరాధించాలి. ఈరోజు హనుమాన్ భక్తులందరూ ప్రత్యేక ఉపవాసం పాటించాలి. హనుమాన్ జయంతి రోజున భక్తులందరూ కొన్ని నియమాలను తప్పక పాటించాలి. నేలపైనే నిద్రించాలి. బ్రహ్మచర్యాన్ని కూడా అనుసరించాలి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×