తరచూ మన తెలుగు ఇళ్లల్లో దిష్టి పెట్టడం, దిష్టి తగలడం వంటి పదాలు వింటూనే ఉంటాము. హిందూ మతంలో ఎవరిదైనా చెడు కన్ను మనపై పడితే దిష్టి తగిలిందని అంటూ ఉంటారు. ఈ నమ్మకం వందల వేల సంవత్సరాలుగా ఉంది. ఇంట్లో ఉన్న అమ్మమ్మలు, నాన్నమ్మలు ప్రతిసారీ పిల్లలకు దిష్టి తీస్తూనే ఉంటారు. ఒకరి చెడు కన్ను పడితే ఆ వ్యక్తి జీవితంలో చెడు సంఘటనలు జరుగుతాయని ప్రజలు నమ్ముతారు. అందుకే తరచూ దిష్టి తీసుకుంటూ ఉంటారు. మీ కుటుంబ సభ్యులను దిష్టి నుండి కాపాడుకోవాలంటే ఒక చిన్న చిట్కా ఉంది. ఇది ఎంతటి చెడు కన్ను ప్రభావాన్ని అయినా తగ్గిస్తుంది. దిష్టి బారిన పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది.
ఇంట్లో ఈ వస్తువు పెట్టండి
మీ ఇంటి గుడిలో అంటే దేవుడి మూలలో ఎల్లప్పుడూ కర్పూరం ఉండేలా చూసుకోండి. కర్పూరాన్ని పూజకు మాత్రమే కాదు దిష్టి తగలకుండా అడ్డుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. కర్పూరం పొగ చుట్టుపక్కల ఉన్న పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. కర్పూరం ఉపయోగించడం ద్వారా దిష్టి నుండి బయటపడవచ్చు.
కర్పూరంతో దిష్టి తీసేయండి
ఎవరిదైనా చెడు కన్ను మీపై పడిందనిపిస్తే అంటే దిష్టి తగిలింది అనిపిస్తే దీపంలో కర్పూరం ముక్కను వేసి వెలిగించండి. దానిని కంచు లేదా వెండి పాత్రలో ఉంచండి. దానిని ఇంటి ప్రతి మూలకు తీసుకువెళ్లండి. అలాగే ఎవరికి ఇంట్లో దిష్టి తగిలిందని అనుకుంటున్నారో ఆ వ్యక్తి వద్దకు కూడా దానిని తీసుకువెళ్లండి. ఇది మీ ఇంటిని మీ కుటుంబ సభ్యుల్ని దిష్టి బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే తగిలిన దిష్టిని తొలగిస్తుంది.
కర్పూరంతో చేసే చిట్కా
మీకు దిష్టి తగిలిందని అనిపిస్తే మండుతున్న కర్పూరాన్ని తలపైన తిప్పండి. ఇలా ఏడుసార్లు తిప్పాలని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఒక సురక్షితమైన స్థలంలో దాన్ని పడేయండి. ఇప్పుడు ఆ కర్పూరం మంట ఆర్పేసి మీ చేతితోనే కర్పూరాన్ని తీసి ఇంటి నుంచి బయటికి విసిరేయండి. ఇలా చేస్తే ఇంటికి తగిలిన దిష్టి, ఇంట్లోని వారికి తగిలిన దిష్టి మొత్తం పోతాయని చెప్పుకుంటారు.
పూజలో కర్పూరాన్ని కచ్చితంగా ఉపయోగించండి. ఇంటి గుడిలో కర్పూరం వెలిగించి అందరి కుటుంబ సభ్యులను ఒకచోట నిలబెట్టండి. వెలిగిన కర్పూరాన్ని కుటుంబ సభ్యుల తల చుట్టూ తిప్పండి. అప్పుడు మనసులో ఓం నమశ్శివాయ అని లేదా ‘ఓం హ్లీం శ్రీం క్లీం హ్లీం’ అనే మంత్రాన్ని జపించండి. ఇది ఇంటి నుండి చెడు దృష్టిని దూరంగా పోయేలా చేస్తుంది. ప్రతివారం ఒకసారి ఇలా కర్పూరంతో చేస్తే మీ ఇంటికి అంతా మేలే జరుగుతుంది. ఎవరి చెడు కన్న మీపై పడదు.