Illu Illalu Pillalu Today Episode july 21st : నిన్నటి ఎపిసోడ్‌లో.. ప్రేమ కోసం ధీరజ్ వెతుక్కుంటూ వస్తాడు. నీకోసం నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను.. నువ్వెక్కడున్నావా? నీకోసం నేను ఒక అదిరిపోయే సర్ప్రైజ్ తీసుకొచ్చాను అని అంటాడు. నీకోసం ఎంబీఏ ఫార్మ్ తీసుకొచ్చాను. ఇది అయిన తర్వాత నువ్వు ఎమ్మెస్ చేయాలని అనుకుంటున్నావు కదా.. ఫామ్ ఫిల్ చేయమని ధీరజ్ అంటాడు.. ప్రేమ మాత్రం కోపంగా ఆ ఫామ్ ని చించేస్తుంది. అదేంటి ఆలోచించేసావ్ ఎమ్మెస్ చేయడం నీ డ్రీమ్ కదా అని ధీరజ్ అంటాడు.. నా డ్రీమ్ గురించి ఆలోచించాల్సిన అవసరం నీకేంటి అని ధీరజ్ ని అడుగుతుంది ప్రేమ. నీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేనప్పుడు నా గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ధీరజ్ మాత్రం ఆలోచిస్తాడు. ప్రేమ ఎందుకు ఇలా చేస్తుంది అనుకుంటాడు. ప్రేమ నన్ను క్షమించు ధీరజ్ అని ఎమోషనల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీవల్లి సమాధానం చెప్పకుండా బట్టు సర్దుకుంటూనే ఉంటుంది. నిన్నే అడిగేదీ.. ఏమైందీ అని అంటాడు చందు. నేను మా పుట్టింటికి వెళ్లిపోతున్నా అని అంటుంది. ఏమైందీ.. పుట్టింటికి వెళ్లిపోవడం ఏంటి? ఏమైంది అని అడుగుతాడు చందు. సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటుంది శ్రీవల్లి. ఇంతలో రామరాజు వచ్చి ఆగమ్మా అని ఆపుతాడు.. అదేంటమ్మా ఎక్కడికి బ్యాగ్ సర్దుకొని వెళ్తున్నావు.. ఏమైంది అని అడుగుతాడు. మామయ్య గారండీ.. నేను ఇక్కడ ఉండలేనండీ.. ఈ ఇంట్లో ఉండటం నా వల్ల అస్సలు కావడం లేదండీ.. అందుకే మా పుట్టింటికి వెళ్లిపోతా మామయ్య గారండీ పెద్ద ఫిటింగే పెట్టేసింది శ్రీవల్లి.
అమ్మా శ్రీవల్లీ ఏం మాట్లాడుతున్నావు.. నువ్వు లేకపోతే ఈ ఇంట్లో పుల్లలు ఎవరు పెడతారూ.. కాపురాల్లో చిచ్చులు ఎవరు పెడతారు.. నేను ఇక్కడే ఉంటే అందరికి ఇబ్బంది. నేను వెళ్ళిపోతాను అంటుంది.. ప్రేమ మాత్రం ఏదో ప్లాన్ చేస్తుందని అనుకుంటుంది. మొదటి నుంచి వీళ్ళను కంట్రోల్ పెట్టింటే ఇలా మామయ్యకు అవమానాలు జరిగేవి కాదు. తప్పంతా కోడళ్లు చేశారు అని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.
వేదవతి మాత్రం ఏం మాట్లాడుతున్నావు. నోరు అదుపులో పెట్టుకో.. నిన్న కాక మొన్న వచ్చిన దానివి ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? నోరు మూసుకొని ఇంట్లోకి వెళ్ళు అంటుంది.. అయినా తప్పంతా మీదే అత్తగారు. ఆ ఇద్దరి కోడళ్ళను నెత్తిన పెట్టుకుంది. అదే వాళ్లకు అలుసుగా అయిపోయింది. అందుకే వాళ్ళు మిమ్మల్ని కూడా లెక్కచేయకుండా మీ మాటకు విలువ ఇవ్వకుండా చేయాల్సిన తప్పులన్నీ చేశారు..
అయితే అత్తయ్య గారి వల్లే వీళ్ళిద్దరిలా తయారయ్యారు దేవుడు లాంటి మావయ్య గారిని అవమానిస్తున్నారు. అంత అవమానం జరిగిన తర్వాత ఆయన ఇలా ఉండడం మన అదృష్టం అని శ్రీవల్లి కావాలనే ఇంట్లో రచ్చ చేస్తుంది. నేను అందుకే ఇంట్లో ఉన్నాను అని చెప్తున్నాను నేను వెళ్ళిపోతున్నాను మావయ్య గారు నన్ను క్షమించండి అని శ్రీవల్లి అంటుంది. తర్వాత మళ్లీ తిరిగి వచ్చి ఇంట్లో మీకు జరుగుతున్న అవమానాలకి అందరూ కారణం అవుతున్నారు నేను కూడా లేకుంటే మిమ్మల్ని చూసుకునేది ఎవరు అని అంటుంది.
తర్వాత రోజు వేదవతి దగ్గరికి నర్మద వస్తుంది. ఏమైంది అత్తయ్య నాకు చెప్తే నేను వేస్తాను కదా.. అని అన్నా కూడా వేదవతి మీరు చేసింది చాలా మనీ లోపలికి వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత లోపల కూరగాయలు కట్ చేస్తున్నా వేదవతి దగ్గరికి ప్రేమ వస్తుంది. తన కూతురు అమూల్య పేరు మీద వేదవతి ఇన్ డైరెక్ట్ గా ప్రేమని దూరం పెడుతున్నట్టు చెప్పేస్తుంది. మేనకోడలు కదా అని నెత్తికెక్కించుకున్నాను అని అందరూ అంటున్నారు. నాకు ఎవరి సాయం అవసరం లేదు అని వేదవతి అంటుంది.
నర్మద ప్రేమ ఇద్దరు కూడా వేదవతి దగ్గరికి వచ్చి మాకు తల్లిదండ్రులు దగ్గర లేరు మీరే మాకు అన్ని అని ఎమోషనల్ గా కరిగిపోయేలా మాట్లాడతారు. వాళ్ళ మాటలకి వేదవతి కరిగిపోతుంటే.. శ్రీవల్లి వచ్చి అత్తయ్య గారిని ఇలా అంటారా అని మధ్య లో పుల్లలు పెట్టేస్తుంది. వేదవతి మనసులో మళ్లీ కోపాన్ని ద్వేషాన్ని పెరిగేలా చేస్తుంది.. అమ్మయ్య వేదవతి వీరిద్దరిపై సీరియస్ గానే ఉందని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..