Conch Shell: హిందూ మతంలో.. శంఖానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శంఖం యొక్క శబ్దానికి ప్రత్యేకమైన శక్తి ఉంటుందని నమ్ముతారు. ఇది ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఇదిలా ఉంటే.. పూజ గదిలో ఉంచిన శంఖం ఇంట్లో ఆనందం, శాంతిని తెస్తుంది. ఇంట్లో ఉన్న వారికి విజయ ద్వారాలను తెరుస్తుంది. విష్ణు పురాణంలో లక్ష్మీదేవి శంఖంలో నివసిస్తుందని, అందుకే విష్ణువు దానిని ధరిస్తాడని వ్రాయబడింది.
ఇంట్లో ఏదైనా శంఖాన్ని ఉంచే ముందు.. అసలు ఎన్ని రకాల శంఖాలు ఉంటాయి ? ఏ విధమైన శంఖం ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఏ పూజలోనైనా.. దేవుడి విగ్రహాలు, పూజలో ఉపయోగించే వస్తువులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇందులో శంఖం కూడా ఒకటి హిందూ మతంలో.. పూజా సమయంలో శంఖాన్ని ఖచ్చితంగా ఉపయోగిస్తారు. నిజానికి శంఖాన్ని సానుకూల శక్తిని తీసుకురావడానికి ఉపయోగిస్తారు. శంఖం యొక్క పవిత్ర శబ్దం ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూల శక్తులను నాశనం చేస్తుందని, అంతే కాకుండా ఇంటి నుండి వాస్తు దోషాన్ని తొలగిస్తుందని ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటాయని నమ్ముతారు.
శంఖం ఎలా ఉద్భవించింది ?
దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మథనం చేసినప్పుడు శంఖం ఉద్భవించింది అని చెబుతారు. ఆ సమయంలో.. శంఖం, లక్ష్మీ దేవి తర్వాత పుట్టింది. ఈ కారణంగానే శంఖం విష్ణువుకు చాలా ప్రియమైనదని చెబుతారు. అంతే కాకుండా దానిని ఇంట్లో ఉంచుకోవడం , పూజ సమయంలో ఊదడం రెండూ చాలా శుభప్రదంగా భావిస్తారు.
శంఖములు ప్రధానంగా రెండు రకాలు. మొదటిది దక్షిణవర్తి శంఖము , రెండవది వామవర్తి శంఖము. ఈ రెండు శంఖాలకు వాటి స్వంత విభిన్న నియమాలు , ప్రయోజనాలు ఉంటాయి. వాటి ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణావర్తి శంఖం ఊదడం వల్ల కలిగే ప్రయోజనాలు :
పూజా గదిలో దక్షిణవర్తి శంఖాన్ని సరైన పద్ధతిలో ఉంచడం ద్వారా, లక్ష్మీ దేవి ప్రసన్నురాలవుతుంది. అంతే కాకుండా ఈ విధంగా చేయడం వల్ల సంపద సమృద్ధిగా ఉంటుంది.
ఇంట్లో దక్షిణవర్తి శంఖం ఉండటం వల్ల ఇంటి మొత్తం వాతావరణం శుద్ధి అవుతుంది. దీనిని ఊదినప్పుడు వచ్చే శబ్దం అన్ని రకాల ప్రతికూల శక్తులను తొలగించి ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తుంది.
ఇంట్లో దక్షిణవర్తి శంఖాన్ని ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాల ప్రభావం తగ్గుతుంది.
వామవర్తి శంఖం అంటే ఏమిటి ?
వామవర్తి శంఖం యొక్క నోరు ఎడమ వైపుకు తెరుచుకుంటుంది. ఈ శంఖాన్ని శివుడు, విష్ణువు పూజలో ఉపయోగిస్తారు. ఈ శంఖం ధ్యానం , సాధనకు కూడా చాలా మంచిదని భావిస్తారు. వామవర్తి శంఖం ఇంట్లో శాంతి, ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది.
Also Read: బుధుడి సంచారం.. ఈ 5 రాశుల వారికి అన్నీ మంచి రోజులే !
వామవర్తి శంఖం ఊదడం వల్ల కలిగే ప్రయోజనాలు:
పూజ సమయంలో వామవర్తి శంఖాన్ని ఊదడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అంతే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
ఇంట్లో వామవర్తి శంఖాన్ని ఉంచుకోవడం వల్ల దుష్ట శక్తులు , శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది.
వామవర్తి శంఖంలో నింపిన నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ నీటిని తాగడం వల్ల శరీరంలో శక్తి ప్రవాహం పెరుగుతుంది. అంతే కాకుండా వ్యాధుల నుండి రక్షిస్తుంది.