Budh Margi 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ నెల ప్రత్యేకమైనది. ఏప్రిల్ 7 నుండి.. బుధుడు తిరోగమన దిశ వదిలి ప్రత్యక్ష సంచారం చేయనున్నాడు. ప్రస్తుతం శనితో పాటు బుధుడు మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కలయిక చాలా అరుదుగా జరుగుతుంది. దీని ప్రభావం 12 రాశుల యొక్క కెరీర్, వ్యాపారం, సంబంధాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యాల వంటి వాటిపై నేరుగా ఉంటుంది.
జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బుధుడు ప్రత్యక్ష సంచారం చేస్తున్నప్పుడు కమ్యూనికేషన్, అవగాహన, నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది. మరో వైపు.. శని ప్రభావం క్రమశిక్షణ, కృషి , పని రంగానికి సంబంధించిన అంశాలపై కూడా పడుతుంది. ఈ రెండు గ్రహాల సంయోగం మానసిక సమతుల్యతను ప్రభావితం చేయడమే కాకుండా.. చాలా మందికి వారి జీవితాలను కూడా మార్చే అవకాశాలను అందిస్తుంది.
ఏప్రిల్ 7 నుండి.. బుధ గ్రహం తన తిరోగమన గమనాన్ని వదిలి ప్రత్యక్షంగా శనితో పాటు మీన రాశిలో సంచరించనున్నాడు. బుధుడు సంచారం ఈ ఐదు రాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది.
వృషభ రాశి:
బుధుని ప్రత్యక్ష సంచారం వృషభ రాశి వారికి కెరీర్ రంగంలో కొత్త వెలుగును తెచ్చిపెడుతుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ప్రస్తుతం పూర్తవుతాయి. అంతే కాకుండా ఆఫీసుల్లో మీ సూచనలను తీవ్రంగా పరిగణిస్తారు. మీరు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. విద్యా రంగంతో సంబంధం ఉన్నవారికి ఈ సమయం చాలా శుభప్రదం అనే చెప్పాలి. అలాగే, మీరు ఆర్థికంగా కూడా చాలా బలంగా మారతారు. పాత చిక్కుకుపోయిన డబ్బును కూడా తిరిగి పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా మీరు మానసికంగా కూడా ఉపశమనం పొందుతారు.
మిథున రాశి:
మిథున రాశికి అధిపతి బుధుడు, కాబట్టి అతని ప్రత్యక్ష సంచారం ఈ రాశి వారికి ప్రత్యేక ప్రయోజనాలను తెస్తుంది. మీరు ఉద్యోగంలో ఉన్నా లేదా వ్యాపారంలో ఉన్నా.. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా మీ వ్యక్తిత్వంలో కొత్త కాంతి కనిపిస్తుంది. మీ మాటలు ఎంతగా ప్రభావం చూపుతాయంటే.. మీ మాట వినడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. సామాజిక, కుటుంబ స్థాయిలో కూడా వాతావరణం మెరుగ్గా ఉంటుంది. మీ ప్రత్యర్థులు వెనక్కి తగ్గుతారు. అంతే కాకుండా మీ పాత అడ్డంకులు తొలగిపోతాయి.
Also Read: శని, రాహు యుతి.. రాబోయే 51 రోజులు మీకు ఎలా ఉండబోతుందంటే ?
సింహ రాశి:
బుధ గ్రహం ప్రత్యక్షంగా సంచారం వల్ల మీకు కొంత వల్ల ఉపశమనం లభిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. అంతే కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా కూడా కొన్ని సానుకూల పరిస్థితులు మీకు ఎదురుపడతాయి. ఆదాయం పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఖర్చులపై కొంత నియంత్రణ పాటించాల్సిన అవసరం కూడా ఉంది. మీ ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించండి. అంతే కాకుండా మీ మానసిక స్థితి ఎప్పుడూ స్థిరంగా ఉండేటట్లు చూసుకోండి.