E-Paper
Advertisement

Holi 2026: హోలీ వచ్చేసింది.. స్నేహితులు, ఆత్మీయులు, వాట్సప్ స్టేటస్ కోసం అద్భుతమైన తెలుగు కోట్స్!

Holi 2026: హోలీ వచ్చేసింది.. స్నేహితులు, ఆత్మీయులు, వాట్సప్ స్టేటస్ కోసం అద్భుతమైన తెలుగు కోట్స్!
Advertisement

Holi 2026: కులమతాలకు అతీతంగా, పగలు ప్రతీకారాలను విడిచిపెట్టి అందరూ ఒక్కటై జరుపుకునే పండగ హోలీ. ఈ ఫెస్టివల్ మన జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని మన పెద్దలు కూడా చెబుతుంటారు. మనసులోని భావాలను రంగుల రూపంలో వ్యక్తం చేస్తూ, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే ఈ క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే ఈ 2026 హోలీ మీ జీవితంలో సుఖసంతోషాలను, సరికొత్త రంగులను నింపాలని కోరుకుంటూ.. కొన్ని బెస్ట్ హోలీ విషెస్ మీ కోసం.

1) ఈ హోలీ మీ జీవితాన్ని ఇంద్రధనస్సులోని ఏడు రంగులంత అందంగా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు!

Advertisement

2) పాత గొడవలను మర్చిపోదాం.. కొత్త రంగులతో స్నేహ గీతం పాడుదాం. హ్యాపీ హోలీ!

3) రంగు రంగుల చినుకులు మీపై పడి.. మీ జీవితం ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. హ్యాపీ హోలీ 2026!

Advertisement

4) రంగుల పండుగ తెచ్చే ఆనందం మీ ఇంట నిరంతరం ఉండాలి. ఈ హోలీ మీకు మధురమైన జ్ఞాపకాలను మిగల్చాలని ఆశిస్తున్నాను.

5) ద్వేషాన్ని వీడి ప్రేమను పంచుదాం.. రంగుల కేళిలో మునిగి తేలుదాం. మీకు, మీ ప్రియమైన వారికి హోలీ శుభాకాంక్షలు!

6) మీ కళ్లలో మెరుపు, మీ ముఖంలో చిరునవ్వు.. ఈ హోలీ రంగుల్లాగే ఎప్పుడూ వెలిగిపోవాలి.

Also Read: హోలీ ఉత్సాహం రెట్టింపు అవ్వాలంటే.. ఈ తెలుగు సంప్రదాయ స్వీట్స్ తినాల్సిందే!

7) ఈ వసంత కాలం మీ కెరీర్‌లో, జీవితంలో సరికొత్త విజయాల రంగులను నింపాలని ఆశిస్తున్నాను. హ్యాపీ హోలీ!

8) ప్రకృతిని ప్రేమిద్దాం.. సహజ రంగులతో సురక్షితమైన హోలీ జరుపుకుందాం. అందరికీ హోలీ శుభాకాంక్షలు.

9) ఎరుపు రంగు ప్రేమకు, పసుపు రంగు సంతోషానికి, నీలం రంగు శాంతికి చిహ్నం.. ఈ రంగులన్నీ మీ జీవితంలో ఉండాలి.

10) చిన్ననాటి హోలీ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఈ ఏడాది కూడా అంతే సరదాగా గడుపుదాం. హ్యాపీ హోలీ 2026!

11) హోలీ అంటే కేవలం రంగులు పూసుకోవడం కాదు.. మనసులోని మంచిని అందరికీ పంచడం. అందరికీ రంగుల పండుగ శుభాకాంక్షలు!

12) మీ కుటుంబం అంతా కలిసి జరుపుకునే ఈ రంగుల పండుగ.. మీ బంధాలను మరింత గట్టిపరచాలని కోరుకుంటూ.. హోలీ శుభాకాంక్షలు!

13) ఈ రంగుల వెలుగులో మీ కష్టాలన్నీ కరిగిపోయి, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటూ.. హ్యాపీ హోలీ!

14) రంగుల విందు.. సంతోషాల పొందు.. ఈ హోలీ మనందరికీ కావాలి పసందు!

15) అందరికీ ప్రేమపూర్వక హోలీ శుభాకాంక్షలు. రంగుల కేళిలో సురక్షితంగా ఉండండి, ఆనందంగా గడపండి!

Also Read: అసలు హోలీ పండగ ఎప్పుడు జరుపుకోవాలి? 3 లేదా 4వ తేదీనా? ఇవిగో పూర్తి వివరాలు!

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×