E-Paper
Advertisement

Congress Plans: ఆపరేషన్ పీఎం పీఠం.. రాహుల్ గాంధీ కోసం తెలంగాణ నుంచి యాక్షన్ ప్లాన్

Congress Plans: ఆపరేషన్ పీఎం పీఠం.. రాహుల్ గాంధీ కోసం తెలంగాణ నుంచి యాక్షన్ ప్లాన్

Congress Plans: తెలంగాణ ,స్వేచ్ఛ బ్యూరో: దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ను పవర్ లోకి తీసుకువచ్చేందుకు తెలంగాణ నుంచే యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని పార్టీ భావిస్తున్నది. తెలంగాణలోని పవర్ కేంద్రంగా దేశ వ్యాప్తంగా అధికారంలోకి రావాలని పార్టీ ముందుకు సాగుతున్నది. కేవలం ఒక రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా ‘తెలంగాణ మోడల్’ యాక్షన్ ప్లాన్ సిద్ధమవుతోంది. వికారాబాద్ లో ముఖ్య నేతల మధ్య జరిగిన అంతర్గత చర్చలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అప్పగించిన కీలక బాధ్యతలు ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారాయి.ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా ఫ్యామిలీకి రిటర్న్ గిప్ట్ ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దీంతో రాహుల్ ను పీఎం చేయాలని టాస్క్ పెట్టుకున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రం నుంచే దేశంలో పవర్ సాధించే చర్యలు చేపట్టాలని కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక కార్యచరణను సీఎం రేవంత్ టీమ్ రూపొందిస్తున్నట్లు తెలిసింది.

Also Read:Jagan Strategy: పాదయాత్ర కంటే ముందే అసలు ఆట.. జగన్ మాస్టర్ ప్లాన్ లీక్! 

రాహుల్ కోసం ‘తెలంగాణ ఫోర్స్?

రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు తెలంగాణ నుంచి ఒక స్పెషల్ టీమ్ రంగంలోకి దిగనుంది. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో సక్సెస్ అయిన వ్యూహకర్తలు, సోషల్ మీడియా టీమ్‌లు ఇకపై దేశవ్యాప్తంగా పనిచేయనున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపునకు కారణమైన ‘గ్యారంటీలు’, ‘క్షేత్రస్థాయి పోరాట పద్ధతులను’ ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఇందుకోసం వివిధ రాష్ట్రాల పరిస్థితులు, అక్కడి ప్రజల మనోభావాలు, సమస్యలు వంటి వాటిపై కూడా ఈ స్పెషట్ టీమ్ అధ్యయనం చేయనున్నది. ఆ తర్వాత ఓట్ బ్యాంక్ కు పెంచుకునేందుకు కాంగ్రెస్ కీలక గ్యారంటీలను ప్రకటించనున్నది. తన అగ్రెసివ్ పాలిటిక్స్‌తో కేసీఆర్‌ను ఓడించిన రేవంత్ రెడ్డి, ఇకపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు మైలేజ్ తెచ్చేందుకు స్టార్ క్యాంపెయినర్‌గానూ వ్యవహరించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. తనను సీఎం పీఠం కూర్చో పెట్టిన రాహుల్ గాంధీ కోసం నిర్వీరామంగా కృషి చేస్తానని సీఎం ఇప్పటికే తన సన్నిహితుల వద్ద పలుమార్లు చెప్పినట్లు సమాచారం.

​రెండు రాష్ట్రాలే టార్గెట్… ఎంపీ సీట్ల వేట

వాస్తవంగా ఢిల్లీలో చక్రం తిప్పాలంటే దక్షిణ భారతం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కీలకంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకోవడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు సంఖ్య ను పెంచుకునేందుకు వెసులుబాటు కలుగుతుంది. తెలంగాణతో పాటు ఏపీలోనూ పార్టీ బలోపేతం కోసం పనిచేయాలని టీ కాంగ్ నేతలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ ఓట్ల శాతాన్ని పెంచి, జాతీత స్థాయిలో బలోపేతం కావాలని సీఎం రేవంత్ ప్లాన్ తయారు చేస్తున్నారు. ఇందుకోసం రెండు రాష్ట్రాల ప్రజలను చైతన్యం చేసేందుకు భారీ బహిరంగ సభలు వంటివి నిర్వహించనున్నారు. అంతేగాక పాదయాత్రల కార్యాచరణ అంతా హైదరాబాద్ నుంచే రూపుదిద్దుకోనుంది.ఇక “దేశం కోసం పనిచేయండి.. మార్పు తెలంగాణ నుంచే మొదలవ్వాలి. మనకు మంచి రోజులు రాబోతున్నాయి. కేంద్రంలో అధికారమే లక్ష్యంగా వర్క్ చేయాలి” అని వికారాబాద్లో డీసీసీల మీటింగ్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు.

తెలంగాణ ఫార్ములా.. దేశవ్యాప్త అమలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన ‘మైక్రో లెవల్ మేనేజ్‌మెంట్’ ఇప్పుడు నేషనల్ లెవల్‌లో కాపీ కాబోతోంది.సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే, భావోద్వేగ అంశాలను ఎలా డీల్ చేయాలో తెలంగాణ నేతలు ఇతర రాష్ట్రాల క్యాడర్‌కు వివరించనున్నారు.ఢిల్లీలో కూర్చుని కాకుండా, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ నుంచి వ్యూహాలు పంపేలా పక్కా ప్లాన్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ప్రధాని పీఠం దిశగా సాగించే ప్రయాణానికి తెలంగాణే ‘పవర్ హౌస్’ కాబోతోందని కాంగ్రెస్ నేతలు ఆశాభవం వ్యక్తం చేశారు. సీఎం టార్గెట్ ఇప్పటి వరకు మిస్ కాలేదని, ఈక్రమంలో రాహుల్ పీఎం కావడం కూడా ఖాయమనే అభిప్రాయాలు పార్టీ నేతల్లో బలంగా నాటుకుపోయాయి. రాహుల్ విజిట్ తర్వాత డీసీసీల్లోనూ కాన్ఫిడెన్స్ పెరిగింది.

Also Read: Kalvakuntla Kavitha: లిక్కర్ స్కామ్ క్లీన్ చీట్.. కాలినడకన తిరుమల కొండను ఎక్కనున్న‌ కవిత..

Related News

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

Big Stories

×