BigTV English

Monthly Horoscope: జూన్‌లో ఈ రాశుల వారికి ఇక తిరుగే లేదు.. ఏ పని చేసినా విజయాలే..

Monthly Horoscope: జూన్‌లో ఈ రాశుల వారికి ఇక తిరుగే లేదు.. ఏ పని చేసినా విజయాలే..

Monthly Horoscope: నేటి నుంచి జూన్ నెల ప్రారంభం కానుంది. టారో కార్డ్ రీడింగ్‌తో పుట్టిన సమయాన్ని భట్టి భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. టారో కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం జూన్ నెలలో మొత్తం 12 రాశుల జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి (మార్చి 21 – ఏప్రిల్ 19):

మేష రాశి వారికి ఈ నెల లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా మీ మనసు చెప్పిన మాటలు, ఆలోచనలు, భావాలను వినండి. అంతేకాదు మనసులో అనిపించే ఆలోచనలను అందరితో వ్యక్తపరచండి. జూన్ నెలలో ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు ఎరుపు.


వృషభ రాశి (ఏప్రిల్ 20 – మే 20):

ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు భారీగా ఉంటాయి. కానీ వాటిని ఖర్చు పెట్టే సమయంలో తెలివిగా పెట్టండి. కళ, విజయంపై దృష్టి పెట్టండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు ఆకుపచ్చ.

మిథున రాశి (మే 21 – జూన్ 20):

మిథున రాశి వారికి ఈనెల జీవితంలో చాలా మార్పులను తెస్తుంది. ఈనెల చాలా కొత్త అనుభవాలు పొందుతారు. అయితే అనుభవాల నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది. తెలిసిన వాటిని అందరితో కమ్యూనికేట్ చేసేలా ఉండండి. జూన్‌లో అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు.

కర్కాటకం (జూన్ 21 – జూలై 22):

కర్కాటక రాశి వారు ఫిర్యాదులు చేయడం, చెడుగా ఆలోచించడం వంటివి మానుకోవాలి. ఈ నెలలో ఈ రాశి వారు గొప్ప విజయాన్ని పొందవచ్చు. అంతరి పట్ల క్షమాపణ కలిగే గుణంతో ఉంటే ఒత్తిడి తగ్గిస్తుంది. జూన్‌లో అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు వెండి వర్ణం.

సింహం (23 జూలై – 22 ఆగస్టు):

సింహ రాశి వారి సమయం సృజనాత్మకంగా ఉంటుంది. ఉత్సాహం ఉంటే జీవితంలో పురోగతిని సాధిస్తారు. లక్ష్యం దిశగా ముందుకు సాగుతారు. ఈ రాశి వారు ప్రేమించే వ్యక్తుల పట్ల వ్యక్తపరచడం కూడా ముఖ్యం. అదృష్ట సంఖ్య 8, అదృష్ట రంగు బంగారు వర్ణం.

కన్యా (ఆగస్టు 23 – సెప్టెంబర్ 22):

కన్యా రాశి వారికి అంతర్గత ప్రతిబింబం, ఆధ్యాత్మిక వృద్ధికి ఈనెల మంచిది. వీరి అంతర్ దృష్టి మాత్రమే వీరికి మార్గనిర్దేశం చేస్తుంది. సంబంధాలలో నిజాయితీగా ఉండండి. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు ముదురు నీలం.

తుల (సెప్టెంబర్ 23 – అక్టోబరు 22):

ఈనెల తుల రాశి వారి జీవితాల్లో విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులకు సహాయం చేయడం మంచిది. వీరికి అవసరమైన మద్దతు కూడా లభిస్తుంది. అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు పింక్.

వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21):

ఈనెల వృశ్చిక రాశి వారికి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఈనెల వీరి జీవితంలో కొత్త ప్రారంభం కానుంది. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రేమించిన తమ భాగస్వామితో బాగా కలిసిపోతారు. అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు మెరూన్.

ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21):

ధనస్సు రాశి వారు ఉత్తేజకరమైన జీవితాన్ని గడపనున్నారు. జూన్‌లో కొత్త అవకాశాలను పొందుతారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. సంబంధాలలో నిజాయితీ, కమ్యూనికేషన్‌ను ఉంచడం మంచిది. అదృష్ట సంఖ్య 1, అదృష్ట రంగు ఊదా.

మకరం (డిసెంబర్ 22 – జనవరి 19):

జూన్ నెలలో మకర రాశి వారు గొప్ప విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కష్టానికి తగిన ఫలాన్ని పొందుతారు. ఎదురయ్యే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అదృష్ట సంఖ్య 10, అదృష్ట రంగు గోధుమ.

కుంభం (20 జనవరి – 18 ఫిబ్రవరి):

కుంభ రాశి వారికి విశ్వాసం పెరుగుతుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. వ్యక్తిగత జీవితం కూడా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 11, అదృష్ట రంగు మణి.

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20):

మీన రాశి వారికి ఈనెల ఆధ్యాత్మికత పట్ల శ్రద్ధ పెరుగుతుంది. జీవితంలో స్పష్టత పెరుగుతుంది. అతీత శక్తులపై నమ్మకం ఉంచి ముందుకు సాగండి. అదృష్ట సంఖ్య 12, అదృష్ట రంగు సముద్ర ఆకుపచ్చ.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×