BigTV English
Advertisement

Brian Lara Advises Rahul Dravid : టీమ్ ఇండియాలో స్టార్లు ఉండి ఏం లాభం: బ్రియాన్ లారా

Brian Lara Advises Rahul Dravid : టీమ్ ఇండియాలో స్టార్లు ఉండి ఏం లాభం: బ్రియాన్ లారా

Brian Lara Advises Rahul Dravid to Prepare Team India for T20 World Cup 2024: గత పదేళ్లుగా టీమ్ ఇండియాలో స్టార్లు అందరూ కలిసి ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా సాధించ లేదు. 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం.. మళ్లీ ఆ స్థాయి సత్తా చాటలేకపోయింది. అయితే అప్పటికి ఇప్పటికి జట్టులో చాలా  తేడాలున్నాయి. కొత్త, పాత క్రికెటర్లతో సమతూకంగా ఉంది. అయితే వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా చేసిన సంచలన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.


టీమ్ ఇండియాలో స్టార్లు ఉన్న మాట నిజమేగానీ, వాళ్లెందుకు దశాబ్ధకాలంగా ఐసీసీ ట్రోఫీని  సాధించ లేకపోయారని కామెంట్ చేశాడు. అంతేకాదు టీమ్ ఇండియా హెడ్ కోచ్ ద్రావిడ్ కి డైరక్టుగా సూచనలు చేశాడు. ఏదో స్టార్లు ఉన్నారు. సీనియర్లు ఉన్నారు.. అంతా వాళ్లే చూసుకుంటారని అనుకోవద్దని అన్నాడు. టీమ్ ఇండియాలో గొప్ప ఆటగాళ్లు ఉండవచ్చు. కానీ ప్రత్యర్థులను ఢీకొట్టగలిగే గొప్ప వ్యూహాలు లేవని కుండబద్దలు కొట్టినట్టు తెలిపాడు.

కానీ ప్రత్యర్థులు మాత్రం టీమ్ ఇండియాలో స్టార్ ప్లేయర్లను అవుట్ చేయడానికి అస్త్ర శస్త్రాలతో వస్తున్నారు. ఒక భయంతో వస్తున్నారు. విజయవంతంగా స్టార్ ప్లేయర్స్ ను అవుట్ చేస్తున్నారని అన్నాడు. అయితే జట్టులో సూపర్ స్టార్లకు కొదవ లేనప్పటికీ కీలక మ్యాచ్‌ల్లో తడబడటం టీమిండియాకు పరిపాటిగా మారింది.


ముందు సూపర్ స్టార్లు అనే ట్యాగ్ లైను వదిలించుకుంటేనేగానీ టీమ్ ఇండియా విజయం సాధించలేదని అన్నాడు. అసలు వరల్డ్ కప్‌ను ఎలా సాధించాలని అనుకుంటున్నారు? వారి వద్ద ఏ ప్రణాళికలు ఉన్నాయి? ఎలా సిద్ధం అవుతున్నారు? ఎలా  దాడి చేయనున్నారు? బౌలింగు అయితే ఎలా? బ్యాటింగ్ అయితే ఎలా? టాస్ ఓడితే ఎలా?  గెలిస్తే ఎలా? ఇలాంటి వ్యూహాలు చాలా  కీలకమని అన్నాడు.

Also Read: టీ 20 ప్రపంచకప్.. ఇంతవరకు ఏం జరిగింది?

ఆటగాళ్లందరినీ ఒక ట్రాక్ పైకి తీసుకువచ్చి టీ 20 వరల్డ్ కప్‌ను గెలిచేలా రాహుల్ ద్రవిడ్ ప్రణాళికలు రూపొందిస్తాడని ఆశిస్తున్నా” అని బ్రియాన్ లారా అన్నాడు. అయితే తను అన్నమాటలు నిజమేనని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు. ఎందుకంటే.. గ్రూప్-ఏలో ఉన్న భారత్ సూపర్-8కు సులువుగానే అర్హత సాధిస్తుంది.

కానీ కరేబియన్ దీవుల్లో జరిగే సూపర్-8లో టీమిండియా విభిన్నమైన పేస్ తో కూడిన పిచ్ లపై ఆడాల్సి ఉంటుంది.. అంతేకాదు బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్‌ నాకౌట్ మ్యాచ్ ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇవన్నీ అంత తేలికకాదని అంటున్నారు.

Related News

IND VS SA: ద‌క్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్, షెడ్యూల్‌, బ‌లాబ‌లాలు ఇవే..ఉచితంగా ఎలా చూడాలంటే

Hong Kong Sixes 2025 : హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టిన పాకిస్తాన్..ఛీ.. ఛీ ఎంతకు తెగించార్రా

IPL 2026: SRH జ‌ట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు క‌లిపి ద‌గా, కావ్యపాప స్కెచ్ చూడండి !

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్‌, వేదిక‌లు ఇవే…హైద‌రాబాద్, విశాఖ‌కు అన్యాయం ?

Cricket players : ఇప్ప‌టి క్రికెట‌ర్లు ఆ వైట్ క్రీమ్ ను ఎందుకు వాడ‌టం లేదో తెలుసా..?

IPL 2026-SSMB 29 : ఐపీఎల్ ఫ్యాన్స్ కు చిచ్చులు పెడుతున్న మహేష్-జక్కన్న, వేలం ఎప్పుడంటే?

Hong Kong Sixes 2025 Final: హాంకాంగ్‌ సిక్సెస్ 2025 విజేత‌గా పాకిస్తాన్..6వ సారి ట్రోఫీ, ప్రైజ్ మ‌నీ ఎంతంటే

IPL 2026: సంజు ఎఫెక్ట్‌..జ‌డేజా అకౌంట్ పై బ్యాక్‌, ఐపీఎల్ 2026కు ముందే సంచ‌ల‌నం !

Big Stories

×