BigTV English

10th Pass: 11వ ప్రయత్నంలో ‘టెన్త్‌’ పాస్.. ఊరేగింపుతో తీసుకెళ్లిన కుటుంబం..

10th Pass: 11వ ప్రయత్నంలో ‘టెన్త్‌’ పాస్.. ఊరేగింపుతో తీసుకెళ్లిన కుటుంబం..

10th Pass: ఇది ఒకప్పటి కాలం కాదు. ఇప్పుడు ఏం జరిగినా అది ఒక ట్రెండ్ అన్నమాటే. నిజం చెప్పాలంటే అప్పటి కాలంలో పదోతరగతి పాస్ అయినా అదొక గొప్ప విజయం అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఏకంగా గ్రాడ్యుయేట్లే అవుతున్నారు. అమెరికా, న్యూయార్క్, లండన్ వంటి విదేశాల్లో చదువుతా పట్టాలు పొందుతున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ వింత ఘటన వెలుగుచూసింది. ఈ కాలంలోను పదోతరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా పట్టించుకోకుండా ఉండే రోజుల్లో ఓ వ్యక్తి టెన్త్ పాస్ అయ్యాడని తన కుటుంబం ఏకంగా పండుగ చేసుకుంది.


తాజాగా మహారాష్ట్రలో విచిత్ర ఘటన వెలుగుచూసింది. 10 సార్లు పదోతరగతి పాస్ అవ్వాలని ప్రయత్నించి ఓడిపోయిన ఓ వ్యక్తి ఏకంగా పదకొండో సారి పాస్ అవ్వడం ఆ కుటుంబాన్ని సంతోషపరిచింది. దీంతో ఏకంగా ఊరేగింపుతోనే ఇంటికి ఆహ్వానం పలికారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీడ్‌లోని పర్లీ గ్రామానికి చెందిన కృష్ణనామ్‌దేవ్‌ ముండే ఈ ఘనత సాధించాడు. అతడు 2018లో పదవ తరగతి ఫెయిల్ అయ్యాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 10 సార్లు పరీక్ష రాశాడు. అయినా పాస్ అవ్వలేదు. కానీ పట్టుదలతో మరోసారి ప్రయత్నించాడు.

తాజాగా రాసిన పరీక్షల్లో పాస్ అవడంతో ఏకంగా గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఊరేగింపుతో తీసుకెళ్లారు. మెళ తాళాల మధ్య పూల మాల వేసి మరి స్వాగతం పలికారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×