BigTV English

Horoscope: రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆదాయం రెట్టింపు

Horoscope: రాశి ఫలాలు..ఈ రాశి వారికి ఆదాయం రెట్టింపు

Astrology Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం..రాశిఫలాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. శనివారం మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకుందాం.


మేషం:
మేషరాశికి అనుకూలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు మిశ్రమంగా ఉంటాయి. ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబ సలహాలు పాటించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

వృషభం:
ఈ రాశి వారికి మిశ్రమకాలం. పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. విజయాలు అంత సులువుగా రావు. ప్రయాణంలో ఆటంకాలు. భయాందోళనలు దరిచేరనీయకండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆంజేనేయుడిని దర్శించుకోవాలి.


మిథునం:
మిథునరాశి వారికి అనుకూలం. చేసే పని విజయవంతంగా పూర్తవుతుంది. వృత్తి, వ్యాపార రంగాల వారికి పనుల్లో పురోగతి, ఆర్థిక వృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఇష్టదేవారాధన చేస్తే మంచిది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలం. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఇతరులు సహకారం ఉంటుంది. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. ప్రయోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కనకధారాస్తోత్రం చదవాలి.

సింహం:
సింహరాశి వారికి అనుకూలం. ఆటంకాలతో శ్రమ అధికమవుతుంది. ఇష్టమైన వారితో సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తారు. శివుడికి అభిషేకాలు చేయించాలి.

కన్య:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు. మీ మీ రంగాల్లో ప్రోత్సాహం ఉంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సమయానికి విశ్రాంతి అవసరం. జీవిత భాగస్వామితో వాదనలు, ఘర్షణలకు అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుగులు ఉంటాయి. చంద్ర శ్లోకం చదవాలి.

తుల:
తుల రాశి వారికి అనుకూలం. మీ పని పట్ల ప్రశంసలు లభిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తారా బలం అద్భుతం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. హనుమాన్ చాలీసా చదవాలి.

వృశ్చికం:
ఈ రాశి వారికి సామన్యంగా ఉంటుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో సహనం అవసరం. అనవసర ఖర్చులు ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

ధనుస్సు:
ధనుస్సు వారికి ఫలప్రదంగా ఉంటుంది. అందరినీ కలుపుకొని పోవాలి. కీలక వ్యవహారాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో శుభవార్తలు ఉంటారు. ప్రయాణాలు ఉంటాయి. వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. ఆంజనేయుడిని దర్శించుకోవాలి.

మకరం:
ఈ రాశి వారికి మిశ్రమకాలం. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది. పెద్ద మొత్తంలో ధనవ్యయం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం రాకపోవచ్చు. ముఖ్య పనుల్లో పెద్దల సలహాలు అవసరం. నవగ్రహ స్తోత్రం చదవాలి.

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలం. దైవ బలంతో అనూహ్య ఫలితాన్ని సాధిస్తారు. చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు పట్టుదలతో పనిచేస్తారు. వ్యాపారులకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ఇష్టదేవతారాధన శుభప్రదం.

మీనం:
మీనరాశి వారికి అద్భుతంగా ఉంది. అన్ని రంగాల వారికి అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులు పనిలో కీలకంగా వ్యవహరిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. వ్యాపారస్తులకు మంచి కాంట్రాక్టు లభిస్తాయి, ఊహించని ధనలాభం ఉంటుంది. వేంకటేశ్వరస్వామి ఆరాధన మంచిది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×