BigTV English

Mudragada Padmanabha Reddy: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ముద్రగడ సలహా..ఏంటో తెలుసా?

Mudragada Padmanabha Reddy: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ముద్రగడ సలహా..ఏంటో తెలుసా?
Mudragada about Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలిచారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.అనంతరం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. కాగా, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
సినిమాలు చేస్తారా?
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే డిప్యూటీ సీఎంగా ఉంటూ పవన్ సినిమాలు చేస్తారా? లేదా అనే విషయాలపై క్లారిటీ లేదు. ఈ సమయంలో మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్‌కు ఓ సలహా ఇచ్చారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినందున సినిమాలను పూర్తిగా వదిలి.. ప్రజాసేవకు పూర్తి సమయం కేటాయించాలని సూచించారు. కాగా, ఇప్పటికే పవన్ నటిస్తున్న కొన్ని సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఎన్నికలకు ముందే ఈ సినిమాలకు సంబంధించి షూటింగ్స్ స్టార్ట్ చేశారు.
గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పూర్తిగా సినిమాలు మానేశారని ముద్రగడ గుర్తు చేశారు. ఒక సినిమాలో నటించాల్సి వస్తే కేంద్రం లేదా సుప్రీం కోర్టు అనుమతి తీసుకొని నటించారని చెప్పుకొచ్చారు. పవన్ కూడా అలా చేయాలని ముద్రగడ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ముద్రగడ, పవన్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
దమ్మున్న లీడర్..
ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిపికేషన్ వచ్చింది. ఈ గెజిట్ పత్రాలను పవన్‌కు పంపిన ముద్రగడ..ఎమోషనల్ అయ్యారు. నేను అసమర్థుడిని..పవన్ దమ్మున్న నాయకుడు అంటూ ముద్రగడ భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పవన్ కల్యాణ్ కీలకంగా ఉన్నారన్నారు. కాపుల చిరకాల కోరిక తీర్చే అవకాశం ఉన్న దమ్ము, ధైర్యం ఉన్న లీడర్ పవన్ కల్యాణ్ అని పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ఇటీవల ఎన్నికల్లో గెలిస్తే తన పేరును రెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించిన ముద్రగడ..మాట నిలబెట్టుకున్నారు. అయితే సినిమా రంగంలో అగ్ర కథానాయకుడిగా ఉన్న పవన్‌కు ఆయన సలహా అవసరం లేదని సోషల్ మీడియాల్లో కామెంట్లు వస్తున్నాయి. హిందూపురం నుంచి మూడోసారి ఎన్నికైనా బాలకృష్ణ గత పదేళ్లుగా నటిస్తూనే ఉన్న సంగతి ఆ రెడ్డిగారికి తెలియదా? అని వ్యాఖ్యానిస్తున్నారు.


Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×