BigTV English

Horoscope 13 october 2024: ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో సమస్యలు.. ఇలా చేస్తే పరిష్కారం!

Horoscope 13 october 2024: ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో సమస్యలు.. ఇలా చేస్తే పరిష్కారం!

Astrology 13 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి? అనే విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో శ్రమ తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. సంపద వృద్ధి చెందుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేస్తే మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పెద్దల సహకారం ఉంటుంది. అన్ని రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. గిట్టనివారితో ఆచితూచి వ్యవహరించాలి. ఆదిత్య హృదయం పఠిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది.


మిథునం:
మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఎదురైనా ఎదుర్కొని విజయం సాధిస్తారు. శారీరీక శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. కోపం, చిరాకులకు దూరంగా ఉండాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రమోషన్స్, జీతం పెరుగుదల ఉండవచ్చు. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. నవగ్రహ శ్లోకాలు చదవాలి.

కర్కాటకం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి లాభాలు అంతంత మాత్రమే ఉంటాయి. చేసే పనుల్లో ఏకాగ్రత కోల్పోవద్దు. ఉద్యోగులు తోటివారి సహకారంతో పనిచేస్తే విజయం వరిస్తుంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోవాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దత్తాత్రేయ సందర్శనం శుభదాయకం.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఊహించన లాభాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో పెద్దల సలహాలతో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పొందుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సంపద రెట్టింపు పెరుగుతుంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ లలిత సహస్రనామ పారాయణ శుభకరం.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ, ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు అప్పగించిన పనులు సకాలంలో పూర్త చేస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యలు రాకుండా శ్రద్ధ తీసుకోవాలి. హనుమాన్ చాలీసా పారాయణ శక్తినిస్తుంది.

Also Read: రేపటి నుండి మేషం సహా ఈ 3 రాశుల వారు తస్మాత్ జాగ్రత్త

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో అభివృద్ధి సాధిస్తారు. అన్ని రంగాల వారికి ఊహించని ధన లాభాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. సాయి నామాన్ని స్మరిస్తే శుభప్రదం.

వృశ్చికం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. పెద్దల సలహాలతో సమస్యలను పరిష్కరించుకోవాలి. ఒత్తడికి గురికాకుండా సొంత అభిప్రాయాలను రుద్దవద్దు. హనుమాన్ చాలీసా పారాయణ మంచిది.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో నిర్లక్ష్యం, సోమరితనం పనికిరాదు. వ్యాపారంలో విపరీతమైన పోటీ ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రసన్నాంజనేయ స్తోత్ర పారాయణ చేయాలి.

మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఇంట్లో శుభవార్త వింటారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. మిత్రుల సహకారంతో కీలక పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. కనధారా స్తోత్రం పఠిస్తే మంచిది.

కుంభం:
కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాలను పెద్దల సలహాలతో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు స్థాన చలనం ఉంటుంది. ఇతరులతో వాదనలకు దిగవద్దు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగై ఫలితాలు పొందుతారు.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆశించిన లాభాలు వరిస్తాయి. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో విహర యాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. గణపతిని ఆరాధిస్తే ఆటంకాలు తొలగిపోతాయి.

Related News

Vinayaka Chavithi 2025: వినాయక చవితి స్పెషల్.. శంఖుల గణనాథుడు భక్తులను.. తెగ ఆకట్టుకుంటున్నాడు!

Mahabhagya Yoga 2025: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Vastu Tips: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇలా పూజిస్తే.. సంపద, శ్రేయస్సు !

Khairatabad Ganesh 2025: ఖైరతాబాద్ గణేశుడి లీలలు తెలుసుకుందాం రండి!

Tirumala Special: ఏరువాడ పంచెల రహస్యం ఇదే.. శ్రీవారి భక్తులు తప్పక తెలుసుకోండి!

Big Stories

×