BigTV English

Feviquik tips: చేతికి ఫెవిక్విక్ అంటుకుందా.. ఒక్కసారి ఈ ట్రిక్ ప్రయత్నించండి..

Feviquik tips: చేతికి ఫెవిక్విక్ అంటుకుందా.. ఒక్కసారి ఈ ట్రిక్ ప్రయత్నించండి..
Advertisement

Feviquik tips: మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న పనుల కోసం ఫెవిక్విక్ లేదా ఫెవికాల్ వాడటం చాలా కామన్‌ అయిపోయింది. బూటు తెగిపోయినా, ఫోన్ కవర్ కూలిపోయినా, గాజు వస్తువు విరిగినా వెంటనే అందుబాటులో ఉండేది ఈ ఫెవిక్విక్. కానీ ఫెవిక్విక్ అంటే పేరే చెప్పినట్టు వెంటనే అంటుకునే పదార్థం. ఒకసారి చేతికి పడితే అంత ఈజీగా వదలదు. చాలామంది భయపడిపోతారు కూడా, చర్మానికి అంటుకుందే, పాడు అవుతుందేమో అని. కానీ భయపడాల్సిన పని లేదు. మీ చేతికి ఫెవిక్విక్ అంటుకున్నప్పుడు కేవలం ఇంట్లో ఉన్న వస్తువులే చాలు దాన్ని తేలిగ్గా తొలగించడానికి. ఇప్పుడు ఆ చిట్కాలు ఒక్కొక్కటిగా చూద్దాం.


గోరువెచ్చని నీరు – సబ్బు చిట్కా

ముందుగా సింపుల్‌గా ప్రయత్నించాల్సింది ఇదే. ఒక బౌల్‌లో గోరువెచ్చని నీరు తీసుకోండి. అందులో కొద్దిగా సబ్బు కలపండి. ఆ నీటిలో చేతిని 10 నిమిషాల పాటు నానబెట్టండి. ఫెవిక్విక్ అంటుకున్న ప్రదేశం మృదువుగా అవుతుంది. ఆ తరువాత ఆ ప్రాంతాన్ని నెమ్మదిగా రుద్దితే ఆ గ్లూ తానే ఊడిపోతుంది. బలంగా రుద్దకండి, చర్మం దెబ్బతినొచ్చు.


వెజిటబుల్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె

ఇంట్లో తప్పనిసరిగా ఉండేది నూనె. ఈ నూనె ఫెవిక్విక్‌ను కరిగించడంలో చాలా బాగా పనిచేస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనె లేదా వెజిటబుల్ ఆయిల్ తీసుకుని అంటుకున్న ప్రదేశంలో మర్దన చేయండి. రెండు మూడు నిమిషాల తర్వాత ఆ గ్లూ నెమ్మదిగా వదులుతుంది. ఆ తర్వాత చేతిని సబ్బుతో కడిగేస్తే చాలు.

వెనిగర్ లేదా నిమ్మరసం

ఇవి రెండు కూడా నేచురల్ యాసిడ్‌లా పనిచేస్తాయి. ఫెవిక్విక్ గట్టిపడిన భాగాన్ని మృదువుగా చేయడంలో ఇవి బాగా సహాయపడతాయి. ఒక చిన్న కాటన్ తీసుకుని దానిపై కొద్దిగా వెనిగర్ లేదా నిమ్మరసం వేసి, అంటుకున్న ప్రదేశంపై రుద్దండి. 5 నిమిషాల తర్వాత చర్మం నుండి ఆ గ్లూ సడిలవుతుంది.

నెయిల్ పాలిష్ రిమూవర్

ఇది చాలామందికి తెలియని కానీ చాలా ఇఫెక్టివ్ చిట్కా. నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ఉండే ‘అసెటోన్’ అనే పదార్థం ఫెవిక్విక్‌ను కరిగిస్తుంది. ఒక కాటన్ ప్యాడ్‌తో రిమూవర్ తీసుకుని ఆ ప్రాంతంపై రుద్దండి. కొన్ని నిమిషాల్లోనే గ్లూ తానే ఊడిపోతుంది. అయితే ఈ రిమూవర్ చర్మానికి కొంచెం డ్రై చేసేస్తుంది కాబట్టి తర్వాత మాయిశ్చరైజర్ తప్పక రాయండి.

Also Read: Galaxy Swan Plus: సామ్‌సంగ్ మైండ్ బ్లోయింగ్ మోడల్.. ఈ ఫోన్ చూసి ఆపిల్ కూడా భయపడాల్సిందే

ఉప్పు – నీరు

ఇది పాతకాలం నుంచి ఉపయోగించే చిట్కా. ఒక టీస్పూన్ ఉప్పు తీసుకుని కొద్దిగా నీటితో పేస్ట్‌లా కలపండి. ఆ పేస్ట్‌ను ఫెవిక్విక్ అంటుకున్న చోట రుద్దండి. ఇది స్క్రబ్‌లా పనిచేసి గ్లూను తేలిగ్గా తీసేస్తుంది. తర్వాత చేతిని శుభ్రంగా కడిగి క్రీమ్ రాయండి.

బలంగా రుద్దకండి, పళ్ళతో తీసేయకండి

ఇది చాలా మంది చేసే పొరపాటు. ఫెవిక్విక్ అంటుకున్న వెంటనే దాన్ని పళ్ళతో గోకడం లేదా కత్తితో గీయడం వల్ల చర్మం దెబ్బతింటుంది. ఆ ప్రదేశం ఇన్‌ఫెక్షన్‌కి గురవుతుంది కూడా. కాబట్టి ఓపికగా పై చెప్పిన పద్ధతుల్లో ఒకదాన్ని ఫాలో అవండి.

ఫెవిక్విక్ కళ్లకు లేదా పెదవులకు తగిలితే

ఇది అత్యవసర పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో రిమూవ్ చేయడానికి ప్రయత్నించకండి. వెంటనే చల్లని నీటితో కడిగి, దగ్గరలోని వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే ఆ భాగాలు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. అశ్రద్ధ చేస్తే కంటి చూపు పోయే ప్రమాదం ఉంది

తర్వాత జాగ్రత్తలు

మళ్ళీ ఫెవిక్విక్ వాడేటప్పుడు ముందు చేతులకు గ్లోవ్స్ వేసుకోండి లేదా ఒక చిన్న పేపర్‌ లేదా టూత్‌పిక్‌తో మాత్రమే వాడండి. అలా చేస్తే చేతులకు తగిలే ప్రమాదం ఉండదు. ఫెవిక్విక్ అంటుకుందంటే భయపడకండి. రసాయనాలు వేసుకోవద్దు. ఒక్కసారి ప్రయత్నిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఇంత ఈజీగా తీసేయచ్చా అని.

Related News

Rare Cancer: నెలలో ఇన్నిసార్లు స్ఖలిస్తే.. ఆ క్యాన్సర్ రాదట, ఇక మొదలు పెట్టండి అబ్బాయిలూ!

Drinking Water: నీళ్లు తాగడం మానేస్తే శరీరం ఏమవుతుందో తెలుసా? నిజం తెలుసుకుంటే షాక్ అవుతారు

Heart Attack: చిన్న వయసులోనే గుండెపోటు.. కారణం స్కూల్ బ్యాగ్ ఒత్తిడేనా?

Calcium Rich Fruits: కాల్షియం లోపమా ? ఈ ఫ్రూట్స్‌తో ప్రాబ్లమ్ సాల్వ్ !

Pomegranate: దానిమ్మ తింటున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Bluetoothing: బ్లూటూతింగ్.. ఎయిడ్స్‌కు కారణమవుతోన్న ఈ కొత్త ట్రెండ్ గురించి తెలుసా? ఆ దేశమంతా నాశనం!

Bed Bugs: బెడ్ మీద నల్లులు నిద్రలేకుండా చేస్తున్నాయా? ఇలా చేస్తే మళ్లీ రావు!

Big Stories

×