HCA Controversy: మరో వివాదంలో HCA చిక్కుంది. ఈ తరుణంలోనే HCA పై, పలువురి ప్లేయర్స్ పై రాచకొండ సిపికి ఫిర్యాదు చేశారు. HCA లో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం రేపింది. అండర్ 16, అండర్ 19,అండర్ 23 లీగ్ మ్యాచుల్లో పలువురు ప్లేయర్ల ఫేక్ బాగోతం బయట పడింది. నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో లీగ్ లో ఎంట్రీ ఇస్తున్నారట ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్లు. ఇక గతంలో ఆరుగురు ప్లేయర్స్ ను గుర్తించి వారిపై బ్యాన్ విధించింది బీసీసీఐ. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ లీగ్ లో అడే విధంగా అవకాశమిస్తున్న HCA.. ఇప్పుడు మరోసారి దొరికిపోయింది. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు నష్టం వాటిల్లె విధంగా HCA వ్యవహరిస్తోంది. అవినీతికి పాల్పడి టాలెంట్ లేకున్నా ప్లేయర్లను ఆడిస్తున్న HCA అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు HCA పై, పలువురు ప్లేయర్లపై రాచకొండ సీపీకి ఫిర్యాదు చేసిన అనంత రెడ్డి… రుజువులు బయటపెట్టారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చుట్టూ వివాదాలే తతెత్తుతున్నాయి. మొన్నటి వరకు సన్రైజర్స్ హైదరాబాద్ టికెట్ల వివాదం, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిధుల దుర్వినియోగం ఇలా అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ కేసు కింద 2025 జూలైలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు.
2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ టికెట్ల కేటాయింపు, నిధుల దుర్వినియోగం, పత్రాల ఫోర్జరీ అలాగే ఇతర మోసాలకు పాల్పడినందుకుగాను జగన్మోహన్ రావు ను అరెస్టు చేశారు. ఈ కేసులో సిఐడి దర్యాప్తు వేగవంతం చేస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి వచ్చిన నిధులను జగన్మోహన్ రావు దుర్వినియోగం చేశారని ఆధారాలు కూడా సేకరించారట సిఐడి పోలీసులు. ఒక కోటి రూపాయలకు 1340 క్రికెట్ బంతులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు HCA లో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం రేపింది. జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల దందా మొదలై నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో లీగ్ లో ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్లు ఎంట్రీ ఇస్తున్నారట. అలాంటి వారి ఉంచి డబ్బులు తీసుకొని ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Smriti Mandhana: గిల్ ఓ పిల్లబచ్చా…స్మృతి మందాన కండలు చూడండి…పిసికి చంపేయడం ఖాయం !
మరో వివాదంలో HCA
HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల కలకలం
అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్ మ్యాచుల్లో పలువురు ప్లేయర్ల ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల బాగోతం
నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో లీగ్లో ఎంట్రీ ఇస్తున్న ఎక్కువ వయసున్న ప్లేయర్లు
HCA పై, పలువురు ప్లేయర్లపై రాచకొండ సీపీకి ఫిర్యాదు pic.twitter.com/LCaFgA7u0m
— BIG TV Breaking News (@bigtvtelugu) October 14, 2025