Gautam Gambhir: టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ లో ఆడతారా ? లేదా ? అనే దానిపై టీమిండియా హైడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇచ్చారు. వాళ్ళిద్దరూ వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్లో ఆడేది డౌట్ అన్నట్లుగానే గంభీర్ రిప్లై ఇచ్చారు. దానిపై గ్యారెంటీ ఇవ్వబోనని క్లారిటీ ఇచ్చారు. వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ గిల్ సేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్ అనంతరం గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు గౌతమ్ గంభీర్.
2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఆడేది తాను గ్యారంటీ ఇవ్వబోనని గౌతమ్ గంభీర్ వెల్లడించారు. అది వాళ్ళ ఆట తీరుపైన ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ కు మరో రెండేళ్ల సమయం ఉంది.. అప్పటి వరకు పరిస్థితిలు పూర్తిగా మారిపోతాయని పేర్కొన్నారు. 2027 వరకు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు ఫిట్ గా ఉంటేనే జట్టులోకి తీసుకుంటామని తెలిపాడు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య త్వరలోనే జరగనున్న వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు బాగా ఆడతారని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు గౌతమ్ గంభీర్. ఇది ఇలా ఉండగా, 2027 వరల్డ్ కప్ టోర్నమెంట్ సమయానికి విరాట్ కోహ్లీ 38 సంవత్సరాలకు వస్తాడు. రోహిత్ శర్మ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాడు. అలాంటి సమయంలో రోహిత్ శర్మ అటు విరాట్ కోహ్లీ ఇద్దరు ఫిట్ గా ఉంటారని నమ్మకం గా చెప్పడం కష్టమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు. అయితే టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య త్వరలో జరగనున్న వన్డే సిరీస్ లో ఈ ఇద్దరు ప్లేయర్లు బాగా ఆడితే కచ్చితంగా అవకాశం ఉంటుంది. మరి ఎలా ఆడతారో చూడాలి.
Also Read: Smriti Mandhana: గిల్ ఓ పిల్లబచ్చా…స్మృతి మందాన కండలు చూడండి…పిసికి చంపేయడం ఖాయం !
టీమిండియా 23 ఏళ్ల కుర్రాడు హర్షిత్ రాణాపై రకరకాల ట్రోలింగ్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి మ్యాచ్ లోనూ హర్షిత్ రాణాను ఆడించడంపై మాజీ క్రికెటర్లు, టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా గౌతమ్ గంభీర్ స్పందించారు. హర్షిత్ రాణాను బ్లేమ్ చేసేందుకు కొంతమంది సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. యూట్యూబ్ లో వ్యూస్ కోసం మరికొంతమంది పిచ్చి రాతలు రాస్తున్నారని నిప్పులు చెరిగారు గౌతమ్. 23 ఏళ్ల కుర్రాడిని పట్టుకొని దారుణంగా ట్రోలింగ్ చేయడం అన్యాయం అన్నారు.