IPS Puran Kumar: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆత్మహత్యకు ముందు తీసిన సెల్ఫీ వీడియోలో అతను పూరణ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. పూరణ్ ఓ అవినీతి అధికారి అని.. ఆయన చేసిన అకృత్యాలు ఇన్నీ ఇన్నీ కావు అంటూ ఆరోపించాడు. సైబర్ సెల్‌లో పనిచేసే అస్టిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అసలు హర్యానా పోలీస్ శాఖలో అసలేం జరుగుతోందనేది ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఃఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ కేసులో ఇప్పటికే హర్యానా ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ శ్రతుజీత కపూర్‌ను సెలవుపై పంపింది ప్రభుత్వం. ఇప్పటికే కపూర్ ను తొలగించాలని ఐపీఎస్ అధికారి భార్య , దళిత సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతున్న క్రమంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పూరణ్ ఆత్మహత్యకు 16 మంది ఉన్నతాధికారుల వేదింపులే కారణమనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పటికే ఈ అంశం పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
ALSO READ: Konda Surekha: మేడారం టెండర్ల విషయంలో మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు.. నా ఉద్దేశమదే..!
కానీ.. ఇంతలోనే మరో ఆత్మహత్య జరగడం.. అందులో పూరణ్‌పైనే తీవ్ర ఆరోపణలు చేయడం కొత్త ట్విస్ట్ అనే చెప్పాలి. అవినీతి అధికారికి సంబంధించి నిష్పాక్షికమైన దర్యాప్తు జరగాలి.. అందుకే నేను నా ప్రాణాలను బలి ఇస్తున్నానని చెప్పాడు సందీప్. అంతేకాదు కుల రాజకీయాలను అడ్డుపెట్టుకొని దర్యాప్తును తప్పించుకోవాలని చూస్తున్నారని.. ఇది సరికాదని చెప్పాడు సందీప్.
ALSO READ: Mahesh Kumar Goud: జీవో నంబర్ 9 ఒక చారిత్రాత్మకం.. హైకోర్టు స్టేపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
పూరణ్ కుమార్ ఏమో తన సూసైడ్ నోట్‌లో డీజీపీ సహ ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు రాసి.. కుల వివక్ష చూపిస్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పుడు సందీప్ ఏమో.. అసలు పూరణ్ కుమారే ఓ పెద్ద అవినీతి పరుడని.. కుల రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని దారుణాలకు పాల్పడ్డాడని చెబుతున్నాడు. ఇప్పుడు ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? అనేది తేల్చాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.