Astrology 17 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం పన్నెండు రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? ఏ రాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర విషయాల్లో కలగజేసుకొని ఇబ్బందులు పడతారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తలు అవసరం. శారీరక శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం. పెట్టుబడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయం రెట్టింపు ఉంటుంది. కోర్టు విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన శుభప్రదం.
మిథునం:
మిథునం రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు రాకుండా వ్యవహరించాలి. అన్ని రంగాల వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకండి. శివారాధన శ్రేయస్కరం.
కర్కాటకం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఎదురయ్యే సమస్యలను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు శారీరక శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆదిత్య హృదయం పారాయణ మంచిది.
సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. అన్ని రంగాల వారికి ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉందవచ్చు. ఇతరుల విమర్శలు పట్టించుకోవద్దు. గిట్టనివారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఇష్ట దేవతారధన శుభప్రదం.
కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో సానుకూలత ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. కోపం, చిరాకు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యం క్షీణించడంతో ఖర్చులు పెరుగుతాయి. సమయానికి నిద్రహారాలు ఉండేలా చూసుకోవాలి. సూర్య ఆరాధన మంచిది.
Also Read: అనురాధ నక్షత్రంలోకి శుక్రుడి సంచారం.. 3 రాశుల వారికి ధనలాభం
తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొత్త అవకాశాలు వరిస్తాయి. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే మంచిది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.
వృశ్చికం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. తోటివారి సహాయంతో అధిగమిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో రెట్టింపు ఆదాయం వస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టదైవారాధన మంచిది.
ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన కీలక పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అన్ని రంగాల వారికి నిరాశాజనకంగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు వీడాలి. శారీరక శ్రమ, ఒత్తిడి పెరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సవాళ్లను ఎదుర్కొంటారు. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మంచిది.
మకరం:
మకర రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆదాయం ఆశించిన మేరకు ఉండదు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఊహించని ఖర్చులు ఉంటాయి. మానసికంగా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. శనిస్తోత్ర పారాయణతోమ ప్రతికూలతలు తొలగిపోతాయి.
కుంభం:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. కోపం, చిరాకు దరిచేరనీయవద్దు. ఇతరులతో జాగ్రత్తగా మాట్లాడాలి. శుభవార్త వింటారు. హనుమాన్ చాలీసా పారాయణ మంచిది.
మీనం:
మీనం రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో మెరుగైన లాభాలు ఉంటాయి. సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్తారు. శని ధ్యాన చదివితే శుభప్రదం.