BigTV English

Nindu Noorella Saavasam Serial Today October 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – ఘోరాకు చిక్కిన ఆరు ఆత్మ

Nindu Noorella Saavasam Serial Today October 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి ప్లాన్‌ సక్సెస్‌ – ఘోరాకు చిక్కిన ఆరు ఆత్మ

Nindu Noorella Saavasam Serial Today Episode : అందరూ పార్టీలో ఉండగా మిస్సమ్మ రాథోడ్ ను పిలిచి మనోహరి గురించి చెప్తుంది. ఇవాళ ఎందుకో కొత్తగా రూం లాక్‌ చేసుకుటుందని నాకెందుకో అనుమానంగా ఉందని చెప్తుంది. అమ్ముకు వార్నింగ్‌ ఇచ్చిన విషయం చెప్తుంది. రూంలోకి వచ్చేటప్పుడు పర్మిషన్‌ తీసుకుని రావాలని చెప్పిందట అని మిస్సమ్మ చెప్పగానే రాథోడ్‌ వెంటనే నేను ఇప్పుడే కనుక్కుటాను అని డోర్‌ ఓపెన్‌ చేసుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. డోర్‌ లోపలి సైడు లాక్ చేసుకుని ఉంటుంది. దీంతో రాథోడ్‌ అక్కడే ప్రయత్నిస్తుంటాడు.


లోపల ఘోరతో ఇరిటేటింగ్‌ గా మాట్లాడుతున్న మనోహరి. ఇక మనం ఆరును బంధించలేమా అని అడుగుతుంది. ఇన్నాళ్లు పడిన కష్టం అంతా వృథా అయ్యేట్టు ఉందే అని ఎలాగైనా దాన్ని ఇవాళ బంధించాలని ఆలోచిస్తుంది. ఏదో ఐడియా రావడంతో స్పీడుగా వెళ్లి అల్మరాలో ఉన్న అమర్‌ ఫోటో బయటకు తీస్తుంది. ఇదిగో ఈ అమర్‌ ఫోటో పైన పొడి చల్లి తీసుకెళ్లి ఆ ఆరు చూస్తుండగా ఈ ఫోటోను కింద పడేయాలి. అప్పుడు అది ఫోటోను పైన పెట్టడానికి తీసుకుంటుంది అని మనోహరి ప్లాన్‌ చెప్తుంది. దీంతో ఘోర ఆ ఆత్మ పట్టుకునే లోపు ఎవరైనా తీసేస్తే.. అని డౌట్‌ క్రియేట్‌ చేస్తాడు. తీయకుండా నేను చూస్తాను అని చెప్పి ఫోటో మీద పొడి చల్లించుకుని బయటకు వెళ్తుంది.

బయట డోర్‌ దగ్గరే ఉన్న రాథోడ్‌.. డోర్‌ ఓపెన్ అవుతున్న సౌండ్‌ విని పక్కకు జరుగుతాడు. అక్కడే ఉన్న టేబుల్‌ మీద డస్ట్‌ తుడుస్తున్నట్టు నటిస్తాడు. మనోహరి వచ్చి ఇక్కడేం చేస్తున్నావు రాథోడ్‌ అని అడుగుతుంది. ఇక్కడ దుమ్ము చాలా ఉంది రోజు తుడవడం లేదనుకుంటా? అంటాడు. ఓవర్‌ గా ఉంది కదా? అంటుంది మనహరి.  అవును మేడం అంటూ మనోహరి రూం ఓపెన్‌ చేయడానికి వెళ్తాడు. మనోహరి ఆపుతుంది. లోపలి నుంచి ఏదో సౌండ్‌ వినిపిస్తుంది మేడం అంటే నాకు నేనే అద్దంలో చూసుకుని మాట్లాడుకున్నాను అని చెప్తుంది మనోహరి. దీంతో రాథోడ్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.


ఆరు కోసం వచ్చిన గుప్త తల కిటికీలో ఇరుక్కుపోతుంది. భయంతో ఆరును పిలుస్తాడు గుప్త. ఆరు రాగానే ఇక్కడ చాలా సేపు ఉంటే ప్రమాదం మనం వెళ్దాం పద అంటాడు గుప్త. అయితే గిఫ్ట్‌ ఇచ్చేసి వస్తానని ఆరు వెళ్తుంది. అమర్‌ ఫోటో తీసుకుని వెళ్తున్న ఆరుకు రణవీర్‌ ఎదురుపడతాడు. మనోమరి కంగారుపడుతుంది. ఏంటి మనోహరి ఏదో పనిలో ఉన్నావని నాకు అనిపిస్తుంది. అది నేను చెప్పిన పనేనా అంటూ అడుగుతాడు. ప్లీజ్‌ రణవీర్‌ ఇక్కడ మనల్ని ఇలా ఎవరైనా చూస్తే చాలా ప్రాబ్లమ్‌ అవుతుంది అంటూ ధీనంగా చెప్తుంది మనోహరి.

రణవీర్‌ కోపంగా ప్రాబ్లమ్‌ చేయడానికే కదా నేను వచ్చింది. ఇవాళ సాయంత్రం లోపు దుర్గ నా కళ్లముందుకు రాకపోతే ఈ ఇంట్లో నీ నిజస్వరూపం మొత్తం బయటపెట్టేస్తాను. నువ్వు నీ స్నేహితురాలిని చంపి మొదలు పెట్టిన ఆట. నువ్వు నీ ప్రాణాలు కాపాడుకుంటూ వచ్చిన అన్ని నిజాలను ఆ అమర్‌ ముందు బయటపెడతాను. నువ్వు కోరుకున్న జీవితం నీకు కావాలంటే నా కూతురును నాకివ్వు.. అంటాడు రణవీర్‌. అయితే నాకు కొంచెం టైం కావాలి రణవీర్‌ అని అడుగుతుంది మనోహరి.  టైం కావాలా? నీకు అయితే సరే నేను అమర్‌ కు నిజం చెప్తాను. ఆ తర్వాత నువ్వు ఎంత టైం అయినా తీసుకో మనోహరి అంటాడు రణవీర్‌?

మనోహరి మాట మారుస్తుంది. నిజం చెప్తావా? రణవీర్‌… వెళ్లి చెప్పు. ఈసారి నేను ఆపను. నిజం చెప్తే నీ కూతురు నీ దగ్గరకు వస్తుందా? నువ్వు జీవితం అంతా వెతికినా దుర్గ నీకు దొరకదు అంటూ బెదిరిస్తుంది మనోహరి. దీంతో రణవీర్‌ ఆలోచనలో పడిపోతాడు. సరే మనోహరి ఇదే నేను నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం. ఈసారి దుర్గను నాకు అప్పగించకుంటే నా ఆస్తి మొత్తం పోతుంది. ఆస్థి పోయాక నేను దేన్ని లెక్క చేయనని నీకు బాగా తెలుసు కదా అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు.

రణవీర్‌ వెళ్లిపోయాక మనోహరి అమర్‌ ఫోటోను తీసుకెళ్లి హాల్లో ఒక మూలన పెడుతుంది. మనోహరి ఫోటో పెట్టడం గమనించిన ఆరు తాను తీసుకొచ్చిన గిప్టును మిస్సమ్మకు ఇచ్చి అంజుకు ఇవ్వమని చెప్తుంది. నువ్వే వచ్చి ఇవ్వొచ్చు కదా అని మిస్సమ్మ చెప్పగానే నాకు అర్జెంట్ పని ఉంది వెళ్తున్నాను అంటూ గిప్ట్‌ మిస్సమ్మకు ఇచ్చి మూలకు వెళ్లి అమర్‌ ఫోటో తీసుకుంటుంది. వెంటనే ఆరు పొగలా మారి ఘోర దగ్గరకు వెళ్తుంది. ఘోర ఆరు ఆత్మను సీసాలో బంధిస్తాడు. ఆరును బంధించిన గుప్త గట్టిగా నవ్వుతూ ఉంటాడు.

మరోవైపు గుప్త.. ఆరు కోసం వెతుకుతాడు. ఎక్కడా కనిపించకపోయే సరికి కంగారుపడతాడు. ఇంతలో అక్షింతలు తీసుకుని వచ్చిన మిస్సమ్మ.. అంజు నీకోక సర్‌ప్రైజ్‌ అంటూ ఆరు ఇచ్చిన గిప్ట్‌ ను చూపిస్తుంది. గిప్ట్‌ ను చూసిన అమర్‌ ఉద్వేగానికి లోనవుతాడు. అంజు లాస్ట్‌ ఇయర్‌ అరు చేసిన గిఫ్ట్‌ ను గుర్తు చేసుకుంటుంది.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ  

Brahmamudi Serial Today September 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణకు నిజం చెప్పిన రాజ్‌

Intinti Ramayanam Serial Today September 25th: ‘ఇంటింటి రామాయణం’ సీరియల్‌: జాబ్‌ కు రిజైన్‌ చేసిన అక్షయ్‌

Illu Illalu Pillalu Serial Today September 25th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీద పగ తీర్చుకుంటానన్న విశ్వ

Gunde Ninda Gudi Gantalu Serial Today September 25th: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: రోహిణిని అనుమానించిన బాలు    

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Big Stories

×