BigTV English

Horoscope 25 August 2024:నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అనూహ్య ధనలాభం!

Horoscope 25 August 2024:నేటి రాశి ఫలాలు..ఈ రాశి వారికి అనూహ్య ధనలాభం!

Astrology 25 August 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఈ రాశుల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ఏ రాశి వారికి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కొత్త కార్యక్రమాలు మొదలు పెడతారు. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తిచేస్తారు. అన్ని రంగాల వారు దృఢ సంకల్పంతో విజయం సాధిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతరుల విషయాల్లో తలదూల్చవద్దు. వ్యాపారంలో సమస్యలు ఎదురుకావొచ్చు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.


మిథునం:
మిథునం రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక పనులు ఇతరుల సహకారంతో విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల వారికి లాభాల పంట పడుతుంది.ఉద్యోగులకు ప్రమోషన్స్ లభిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కర్కాటకం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి,వ్యాపార రంగాల వారికి ఆశించిన లాభాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో బంధుమిత్రుల సహకారం అవసరం. స్థిరాస్తి కొనుగోళ్లు విషయంలో లాభాలు వరిస్తాయి. ఇతరులతో ఆచితూచి వ్యహరించాలి. ఉద్యోగులకు హోదా పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మంచిది.

సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో చేపట్టిన పనుల్లో విఘ్నాలు ఎదురవుతాయి. కొత్త ప్రాజెక్టులకు అనుకూలంగా లేదు. కీలక పనులను వాయిదా వేయడం మంచిది. ఇతరులను అతిగా నమ్మకపోవడం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రణాళికతో చేపట్టిన పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో అనూహ్య లాభాలు ఉంటాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆదాయం వృద్ది చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాల విషయంతో జాగ్రత్తులు తీసుకోవాలి. గణపతి ఆలయన సందర్శన శుభకరం.

తుల:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో శారీరక శ్రమ, ఒత్తిడి పెరగవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడవచ్చు. ఇతరులతో ఆచితూచి వ్యహరించాలి. కీలక పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. గొడవలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయిస్తే ఆపదలు తొలగిపోతాయి.

వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ధన ప్రవాహం ఉంటుంది. సమస్యలు తీరి మంచి రోజులు వస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ఊహించని లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.

ధనుస్సు:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానం వంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. కోపం, చిరాకులకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. ఇష్టదేవతాస్తోత్రం చదివితే మంచిది.

మకరం:
మకరరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. మనోబలంతో మొదలుపెట్టిన అన్ని పనులు విజయవంతమవుతాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన లాభాలు ఉంటాయి. ఇతరులతో గొడవలు పడే అవకాశం ఉంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిర్లక్ష్యం పనికిరాదు. నవగ్రహ పూజలు జరిపిస్తే మేలు జరుగుతుంది.

Also Read: భాద్రపద అమావాస్య రోజు ఈ పూజ చేస్తే సంతాన భాగ్యం !

కుంభం:
కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని ధనలాభం ఉంటుంది. ప్రారంభించిన అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. కోపం, ఆవేశాలకు వెళ్లకూడదు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు ఉంటాయి. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

మీనం:
మీనరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి రుణభారం పెరుగుతుంది. పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. వివాదాలు, సమస్యలు ఎదురుకావొచ్చు. వృథా ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులను కలుపుకొని పనిచేయాలి. కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. శివుడిని ఆరాధిస్తే మంచిది.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×