BigTV English

Prashanth Varma: ఖుషీ సినిమా.. పోలీసులు ఇంటికి వచ్చారు

Prashanth Varma: ఖుషీ సినిమా.. పోలీసులు ఇంటికి వచ్చారు

Prashanth Varma: అ! సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మొదటి సినిమాతోనే  ప్రశాంత్ వర్మ.. ప్రేక్షకులకు ఫేవరేట్ డైరెక్టర్ అయిపోయాడు. అందరి డైరెక్టర్స్ లా కుండా కొత్తదనం ను చూపెట్టే అతికొద్దిమంది దర్శకుల్లో ప్రశాంత్ కచ్చితంగా ఉంటాడు. కల్కి, జాంబీ రెడ్డి, హనుమాన్ లాంటి సినిమాలతో వరుస విజయాలను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం అధీరా అనే సినిమాతో బిజీగా ఉన్నాడు.


ఇకపోతే తనకు డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చిన నాని సినిమా సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన ప్రశాంత్.. స్టేజిమీద పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా రోజులను గుర్తు చేసుకున్నాడు. ” కోపం ఎప్పుడైనా వచ్చిందా అంటే.. చిన్నప్పుడు నాకు కోపం ఎక్కువ ఉండేది అంట. అందుకే నా పేరు ప్రశాంత్ అని పెట్టారు. ఎప్పుడు కోప్పడినా.. ప్రశాంత్ అనే పేరు పిలుస్తారు. వెంటనే కామ్ అయిపోతాను. అలా అలా కోపం తగ్గించేశాను. ఇక సరిపోదా శనివారం ఈవెంట్ కు రావడం చాలా ఆనందంగా ఉంది.

నాని గారు నన్ను అ! సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈరోజు నేను హనుమాన్ అనే సినిమా చేయగలిగాను అంటే అది ఆరోజు నానిగారు నన్ను డైరెక్టర్ గా పరిచయం చేయడం వలనే పాజిబుల్ అయ్యింది.  నాలాంటి ఎంతోమంది డైరెక్టర్స్ ను నాని గారు పరిచయం చేస్తున్నారు. ఆయన అలానే  చేయాలనీ నేను కోరుకుంటున్నాను. ఎస్ జె సూర్య గారు నేను మీకు పెద్ద అభిమానిని. మీరు డైరెక్ట్ చేసిన ఖుషీ సినిమా గురించి ఒక సంఘటన చెప్పాలి.


ఖుషీ  సినిమా వచ్చినప్పుడు.. ఉదయం నుంచి నైట్ వరకు అన్ని షోస్ చూస్తూ థియేటర్ లోనే ఉండిపోయాను. రాత్రి ఇంటికి వెళ్తే.. ఇంటిదగ్గర పోలీసులు ఉన్నారు. ఏంటా అని అడిగితే  నేనుతప్పిపోయాను అనుకోని, మా పేరెంట్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది.

హనుమాన్ సినిమాలో సూర్యగారిని అనుకున్నాం.. కానీ, అప్పుడు ఆయనను ఎఫర్ట్ చేయలేక తీసుకోలేదు. కచ్చితంగా తరువాతి సినిమాలో తీసుకుంటాం. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆరేళ్ళ క్రితం నాని గారు నిర్మాతగా మారి  నన్నెలా డైరెక్టర్ గా పరిచయం చేసారో.. ఇప్పుడు నేను నిర్మాతగా మారి  దానయ్య గారి కొడుకును  హీరోగా పరిచయం చేస్తున్నాను.” అని చెప్పుకొచ్చాడు.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×