E-Paper
Advertisement

Horoscope 27 August 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనప్రవాహం!

Horoscope 27 August 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ధనప్రవాహం!

Astrology 27 August 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏరాశి వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.

మేషం:
మేష రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఒత్తిడికి గురవుతారు. వృత్తి, వ్యాపారంలో శ్రమకు తగిన ప్రయోజనాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృథా ఖర్చులు ఉంటాయి. దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పని నెరవేరుతాయి. అన్ని రంగాల వారికి లక్ష్మీకటాక్షం ఉంటుంది. పెద్దల సలహాలతో చిత్తశుద్ధితో అద్భుత విజయాలు సాధిస్తారు. ఊహించని ధనప్రవాహం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. శ్రీలక్ష్మీధ్యానం శుభకరం.

మిథునం:
మిథున రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు ఉంటాయి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఎదురుకావొచ్చు. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

కర్కాటకం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. ఆరోగ్యం సహరిస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.

సింహం:
సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో తిరుగులేని విజయాలు సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది.

కన్య:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగా వారికి ఆర్థిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడి, శ్రమ పెరగవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.

Also Read: కన్య రాశిలో శుక్రుడు సంచారం.. సెప్టెంబర్ 18 వరకు వీరికి శుభ దినాలు

తుల:
ఈ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారంలో ఒత్తిడిని జయించాలి. సొంత నిర్ణయాలు విఫలం కావొచ్చు. వ్యాపారంలో విపరీతమైన పోటీ ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం మంచిది.

వృశ్చికం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి లాభాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పురగోతి, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.

ధనుస్సు:
ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభవార్తలు వింటారు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉండవచ్చు. సమాజంలో హోదా పెరుగుతుంది. తోటివారి సహకారంతో మంచి జరుగుతుంది. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే బాగుంటుంది.

మకరం:
మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఒత్తిడి, శ్రమ పెరుగుతుంది. కుటుంబ సమస్యలతో మానసికంగా ఇబ్బందులు పడతారు. కోపం, చిరాకు తగ్గించుకోవాలి. అనవసర విషయాలపై ఆలోచన చేయకపోవడం మంచిది. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

కుంభం:
కుంభ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి లోపిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. ఉద్యోగులకు శుభసమయం. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో సమిష్టి నిర్ణయాలతో విజయం పొందుతారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ఉద్యోగులు నూతన బాధ్యతలు చేపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×